/rtv/media/media_files/2025/01/02/90Cp7mZ1X6U9j3qq5YHy.jpg)
Earthquakes
గత కొన్ని రోజులుగా భూకంపాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటుంది. గతంలో కంటే పోలిస్తే ఈ ఏడాది భూకంప తీవ్రతలు అధికంగా ఉన్నాయి. తాజాగా మరోసారి భూమి కంపించింది.
ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌కు ఫ్యాన్స్ అవాక్!
చురచంద్‌పూర్‌లో భూకంపం
బుధవారం (మే 28) మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో భూకంప తీవ్రతలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 1:54 గంటలకు 24.46 N అక్షాంశం, 93.70 E రేఖాంశం వద్ద సంభవించిందని తెలిపింది. భూకంపం 40 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది.
ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
EQ of M: 5.2, On: 28/05/2025 01:54:29 IST, Lat: 24.46 N, Long: 93.70 E, Depth: 40 Km, Location: Churachandpur, Manipur.
— National Center for Seismology (@NCS_Earthquake) May 27, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs@DrJitendraSingh@OfficeOfDrJS@Ravi_MoES@Dr_Mishra1966@ndmaindiapic.twitter.com/CXdBtsn9lH
నోనీలో భూకంపం
ఇది జరిగిన అతి కొద్ది నిమిషాల్లోనే మణిపూర్‌లోని నోనీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 2:26 గంటలకు 24.53 N అక్షాంశం, 93.50 E రేఖాంశం వద్ద సంభవించిందని తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా
EQ of M: 2.5, On: 28/05/2025 02:26:10 IST, Lat: 24.53 N, Long: 93.50 E, Depth: 25 Km, Location: Noney, Manipur.
— National Center for Seismology (@NCS_Earthquake) May 27, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs@DrJitendraSingh@OfficeOfDrJS@Ravi_MoES@Dr_Mishra1966@ndmaindiapic.twitter.com/AtlcikyUQ1