Earthquake: గజగజ వణికించిన భారీ భూకంపం.. ప్రజలు పరుగులే పరుగులు- ఎక్కడంటే?

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది అని తెలిపింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

New Update
earthquake

Earthquake of magnitude

ప్రతి రోజు భూకంపం ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భూకంప తీవ్రత వణికిస్తోంది. తాజాగా మరో దేశంలో భూమి కంపించింది. మంగళవారం న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో భారీ స్థాయిలో భూమి వణికింది. రిక్టర్ స్కేలుపై దాదాపు 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

సౌత్ ఐలాండ్  నైరుతి కొన నుండి 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో భూకంపం 7 తీవ్రతతో నమోదైందని USGS తెలిపింది. ప్రకంపన తీవ్రత ఉన్నప్పటికీ.. అధికారులు ఆ ప్రాంతానికి ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇంతలో మరేవైనా ప్రకంపనలు లేదా తదుపరి పరిణామాల కోసం అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌

ఇదిలా ఉంటే మార్చి 21న ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూమి వణికింది. ఇది 160 కి.మీ లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.

ఇండోనేషియాలో

ఇటీవల మరోసారి భూమి షేక్ అయింది. ఇండోనేషియాలోని మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 5.32 UTC వద్ద 132 కి.మీ దూరంలో భారీ భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 32 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు