/rtv/media/media_files/2025/01/02/90Cp7mZ1X6U9j3qq5YHy.jpg)
Earthquakes occurred in Prakasam.
ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరోసారి స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. కొందరైతే.. పరుగులు తీశారు.
Also Read: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం
ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు
— RTV (@RTVnewsnetwork) January 2, 2025
ముండ్లమూరులో మధ్యాహ్నం 1.43కి భూమి కంపించింది
భయాందోళనకు గురైన స్థానికులు..#prakasam #AndhraPradesh #RTV pic.twitter.com/oXxxcVnDT3
ఆందోళన చెందకండి
వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూకంపానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దానికి గల కారణాలను కొన్నింటిని తెలిపారు. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం కావడం వల్లనే భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని.. దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఏది ఏమైనా మరోసారి స్వల్ప భూకంపం రావడంతో ప్రజలు కాస్త భయం భయంతో ఉన్నారనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీ నోటిఫికేషన్స్
ఏపీలో మరోసారి భూకంపం
— Pulse News (@PulseNewsTelugu) January 2, 2025
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో భూ ప్రకంపనలు
మధ్యాహ్నం 1:43 గంటలకు కంపించిన భూమి
భయాందోళనలకు గురైన స్థానిక ప్రజలు#Earthquake #AndhraPradesh #Prakasam #Mundlamuru #APEarthquake pic.twitter.com/ifUsOuLold
గతంలో కూడా
ఇది కూడా చదవండి: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
గతంలో కూడా ప్రకాశం జిల్లాలోనే భూకంపం సంభవించింది. జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో భూమి స్వల్పంగా షేక్ అయ్యింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలతో ఉరుకులు పరుగులు తీశారు. ఇటీవలే ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం, తాళ్లూరు మండలం, పోలవరం, శంకరాపురం, తూర్పుకంభంపాడు, వేంపాడు, మారెళ్ల, పసుపుగల్లు, ముండ్లమూరు, శంకరాపురం సహా మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.