/rtv/media/media_files/2025/02/28/2THaEoPan2weOZvmrcfT.jpg)
Healthy Life Photograph: (Healthy Life)
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిగడుపున తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. పోషకాలు ఉండే గింజలను ఉదయం తీసుకుంటే నీరసం, అలసట అన్ని కూడా పోతాయి. ముఖ్యంగా వేసవిలో ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించో తెలుసా!
నల్ల ఎండుద్రాక్ష
దీనిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు గర్భాశయం, అండాశయాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
పిస్తాపప్పు
పిస్తాపప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి-6, థయామిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల రాత్రి బాగా నిద్రపడుతుంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
బాదం
బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, రాగి, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయి.
డేట్స్
వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో సాయపడుతుంది.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
వాల్‌నట్స్
వాల్‌నట్స్ యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ వాల్‌నట్స్ తినడం వల్ల మీ కండరాలు బలపడతాయి. ఇది గుండె, మెదడుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్‌తో పాటు ఫైబర్, రాగి, ఇనుము, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్