/rtv/media/media_files/2025/10/13/dry-fruits-2025-10-13-16-57-05.jpg)
Dry Fruits
దీపావళి(Diwali 2025) సందర్భంగా స్వీట్స్‌తోపాటు డ్రై ఫ్రూట్స్(dry-fruits) కొనడం సంప్రదాయం. అయితే పండుగల సమయంలో మార్కెట్‌లో కల్తీ, నకిలీ బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష విపరీతంగా అమ్ముడవుతాయి. రంగులు, పాలిష్ లేదా చవకైన ప్రత్యామ్నాయాలను కలిపి విక్రయించే వీటిని గుర్తించి.. మోసపోకుండా ఉండటానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. పండుగ వేళ డ్రై ఫ్రూట్స్ కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నకిలీవి గుర్తించే సింపుల్ చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ అసలు, నకిలీ గుర్తించే చిట్కాలు:
బాదం (Almonds):
బాదం పప్పును చేతిలో వేసి రుద్దండి. రంగు మారితే లేదా చేతికి రంగు అంటితే అది నకిలీదని అర్థం చేసుకోవాలి. నిజమైన బాదం లేత గోధుమ రంగులో.. కొద్దిగా గరుకుగా ఉంటుంది. ఎక్కువ మెరిసే లేదా ముదురు రంగులో ఉన్న బాదం కొనకూడదు. మధ్యస్థ పరిమాణంలో ఉన్న బాదం ఉత్తమమైనది.
జీడిపప్పు (Cashews):
జీడిపప్పును వాసన చూడాలి. నూనె వాసన వస్తే లేదా పసుపు రంగులో ఉంటే.. అవి పాతవి లేదా కల్తీ అయినట్లు భావించాలి.నిజమైన జీడిపప్పు తెల్లగా లేదా లేత క్రీమ్ రంగులో.. గట్టిగా, వాసన లేకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి: పనీర్‌తో పాలకూర పంచాయితీ తెలుసా..? ఈ తప్పు చేస్తే తిప్పలు తప్పవు!!
వాల్‌నట్స్ (Walnuts):
వాల్‌నట్ పప్పును వాసన చూడాలి. బలమైన వాసన లేదా చాలా ముదురు రంగులో ఉంటే.. అవి చెడిపోయినట్లు లెక్క. పెంకు తీయకుండా ఉండే వాల్‌నట్లను కొనడం మంచిది. నిజమైన పప్పు లేత గోధుమ రంగులో ఉంటుంది.
ఎండుద్రాక్ష (Raisins):
ఎండుద్రాక్షను చేతులతో రుద్దాలి. రంగు పోతే లేదా అతిగా తడిగా ఉంటే.. వాటికి రంగు వేసి ఉండవచ్చు లేదా నకిలీవి కావచ్చు. నిజమైన ఎండుద్రాక్ష కొద్దిగా పొడిగా, సహజమైన సువాసనతో.. మితంగా తీయగా ఉంటుంది.
అయితే ఈ డ్రై ఫ్రూట్స్ కొనే ముందు బ్రాండెడ్ ప్యాకింగ్ లేదా విశ్వసనీయ దుకాణాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. బయట ఉంచిన డ్రై ఫ్రూట్స్ కొనవద్దని నిపుణులు చెబుతున్నారు. తయారీ (MFG), గడువు తేదీ (Expiry Date) తప్పక చూడాలని గుర్తుకు ఉంచుకోవాలి. ఇంటికి తెచ్చాక.. చల్లని, పొడి ప్రదేశంలో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: బలం, ఆరోగ్యం ఇచ్చే ఆహారపదార్ధాల జాబితా