Trump: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. భారత్ తరఫున ఎవరు వెళ్లనున్నారంటే ?
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివిధ దేశాలకు అమెరికా ఆహ్వానం పంపుతోంది. భారత్ తరఫున కేంద్ర మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారత విదేశాంగ శాఖ మంత్రి
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 2025 జనవరి 20న జరగనుంది. వైట్‌హౌస్ నుంచి ఇండియాకి ఆహ్వానం అందింది. ప్రమాణస్వీకారానికి భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి S. జైశంకర్ పాల్గొననున్నారు.
USA: హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్ కు బేషరతు విడుదల
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి శిక్ష నుంచి తప్పించుకున్నారు. న్యూ యార్క్ కోర్టు ఆయనకు అన్ కండిషనల్ డిశార్జ్ను విధించింది. దీని ప్రకారం దోషిగా తేలినప్పటికీ జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కొనవసరం లేదు.
USA: హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు ఊరట లభించలేదు. న్యూయార్క్ జడ్జి విధించే శిక్షను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ట్రంప్‌కు శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది.
Canada: ట్రంప్ ఆ మాటలన్నీ విలీన వ్యాఖ్యాల దృష్టి మరల్చేందుకే: ట్రూడో!
డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
California: అమెరికాకు సాయం చేసేందుకు మేము రెడీ: ట్రూడో!
కెనడా 51 వ రాష్ట్రం పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలోలాస్ ఏంజెలెస్ లో వ్యాపిస్తున్న కార్చిచ్చున్ను అదుపు చేసేందుకు సాయం అందిస్తామని ట్రూడో అన్నారు.
అమెరికాలో కెనడా విలీనం.. సాధ్యమేనా..?
కెనడా అమెరికాలో విలీనం చేస్తామని అన్న ట్రంప్ మాటలు సాధ్యంకావని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ లో 51వ స్టేట్‌గా కెనడా కలిసిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశమని దాన్ని ఆక్రమణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
USA: బందీలను విడిచిపెట్టకపోతే మీ పని అంతే..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
మరికొన్నాళ్ళల్లో అమెరికా అధ్యక్షుడిఆ బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.వారి చెరలో ఉన్న బందీలను విడిచి పెట్టకోతే మిలిటెంట్ గ్రూప్‌కు నరకం చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నడూ చూడని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు.