Donald Trump: భారత్ పై 25 శాతం సుంకాలు.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు, జరిమానాలను విధించారు. 2025 ఆగస్టు 1 తేదీ నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తాయి. ఇండియాకు తమకు మిత్ర దేశమేనన్న ట్రంప్..  ఇతర దేశాలకన్నా ఎక్కువ సుంకాలను వసూలు చేసిందన్నారు.  

New Update
donld-trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ పై 25 శాతం సుంకాలు విధించారు.  2025 ఆగస్టు 1 తేదీ నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఇండియా తమకు మిత్ర దేశమేనన్న ట్రంప్.. తాము సంవత్సరాలుగా వారితో చాలా తక్కువ వ్యాపారం చేసామన్నారు. ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ట్రంప్.  భారత్ ఇతర దేశాలకన్నా ఎక్కువ సుంకాలను వసూలు చేసిందన్నారు.  రష్యా నుంచి భారత్‌ ఎక్కువగా సైనిక ఉత్పత్తులు కొంటోందని, ముఖ్యంగా చమురును అధికంగా దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. 

Also Read :పాకిస్థాన్‌కు అమెరికా షాక్.. UNSCలో భారత్ విజయం

వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం

ట్రంప్ తాజా వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ సుంకాల ప్రభావం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో, ట్రంప్ పరిపాలనలో భారత్ తన ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనిపై భారత్ స్పందిస్తూ, కొన్ని అమెరికా ఉత్పత్తుల (ఉదాహరణకు, హై-ఎండ్ బైకులు, బోర్బన్ వంటివి)పై సుంకాలను తగ్గించడానికి సిద్ధంగా ఉందని, అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందం అవసరమని పేర్కొంది.

సుంకాలు అంటే ఏంటీ?

సుంకాలు అంటే ఒక దేశం ఇతర దేశాల నుండి దిగుమతి, ఎగుమతి చేసే వస్తువులు.  ఈ సేవలపై విధించే పన్నులనే సుంకాలని అంటారు. వీటినే  కస్టమ్స్ డ్యూటీలు లేదా దిగుమతి సుంకాలు అని కూడా పిలుస్తారు.  సాధారణంగా  ఈ పన్నులను దిగుమతి చేసుకున్న వస్తువులు దేశంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పన్నులు  చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ వస్తువులపై సుంకాలు విధించడం ద్వారా వాటి ధరలు పెరుగుతాయి. దీనివల్ల దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులు చౌకగా మారతాయి. సుంకాలు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా పనిచేస్తాయి. దిగుమతి అయ్యే వస్తువుల సంఖ్య ఎక్కువగా ఉంటే, సుంకల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. కొన్నిసార్లు, ఒక దేశం తమ ఉత్పత్తులపై ఇతర దేశాలు అధిక సుంకాలు విధించినప్పుడు, దానికి ప్రతీకారంగా ఆ దేశాల ఉత్పత్తులపై తమ దేశంలో సుంకాలు విధించవచ్చు. దీనిని ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం) అని కూడా అంటారు.

Also Read :  మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు

america tarrifs | latest-telugu-news | telugu-news | international news in telugu

Advertisment
తాజా కథనాలు