USA: వాణిజ్య చర్చలకు ఒప్పుకోను...ట్రంప్ మొండి పట్టుదల

అమెరికా అధ్యక్షుడు తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటున్నారు. తాను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక తగ్గేదే లేదని చెబుతున్నారు. సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్ తో ఎటువంటి వాణిజ్య చర్చలుండవని చెప్పారు.

New Update
Trump

Trump

భారత్ నుంచి వచ్చే దిగుమతులపై(US Tariffs On India) సుంకాలను రెట్టింపు చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump). మొదట అన్ని దేశాలతో పాటూ 25శాతమే ప్రకటించారు. కానీ తర్వాత రష్యాతో చమురు వ్యాపారం మానుకోవాలని లేకపోతే అదనపు సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. భారత్ కు 24 గంటలు టైమ్ ఇచ్చారు. అయితే భారత్ మాట వినకపోవడంతో అన్నట్టుగానే ఇండియాపై మరో 25 శాతం అదనపు సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆగస్టు 27 నుంచి ఇవి అమలు అవుతాయని చెప్పారు. రష్యా నుంచి చైనా, యూరోప్ వంటి దేశాలు చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ట్రంప్ వాటిపై ఎటువంటి టారీఫ్ లను విధించలేదు.  దీనిపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. ట్రంప్ ఎన్ని టారీఫ్ లు విధించినా ఒప్పుకోమని తేల్చి చెప్పింది. అమెరికా నుంచి పాలను దిగుమతి చేసుకోలేదనే ట్రంప్ ఇప్పుడు సుంకాలు విధిస్తున్నారని..రష్యా, చమురు అంటూ సాకులు చెబుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :  ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్ట్.. ఎందుకంటే?

చర్చలకు వీలులేదు..

ఈ నేపథ్యంలో వాణిజ్య చర్చలకు భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ ట్రంప్ మాత్రం దానికి అవకాశం లేదని చెప్పారు. సుంకాల పై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌(Ajit Doval) రష్యా పర్యటనలో ఆ దేశాధ్యుక్షుడు పుతిన్ ను కలిశారు. వీరిద్దరి మధ్యా రెండు దేశాల వ్యాహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం లాంటి విషయలపైచర్చ జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడది చివర్లో పుతిన్ భారత పర్యటన గురించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటనలో తెలిపారు. దీనిపట్ల భారత ఎంతో ఉత్సాహంగా ఉందని అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాలు, వాణిజ్య అనిశ్చితుల మధ్య పుతిన్ పర్యటన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోనుందని అజిత్ ధోవల్ చెప్పారు. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా సాగుతున్నామని సూచించారు. ట్రంప్ టారీఫ్ ల నిర్ణయాల నేపథ్యంలో అజిత్ ధోవల్ రష్యా పర్యటన ప్రధాని మోదీ కొత్త వ్యూహం అని చెబుతున్నారు. అలాగే పుతిన్ భారతదేశ పర్యటన కూడా అందులోని భాగమే అంటున్నారు. రెండు దేశాలు కలిసి అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యం ముందు సాగనున్నాయని సమాచారం.

Also Read :  భారత్, రష్యా మరింత స్ట్రాంగ్ గా..ట్రంప్ సుంకాల మధ్య పుతిన్ ను కలిసిన అజిత్ ధోవల్

Advertisment
తాజా కథనాలు