/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించారు. అత్యధికంగా సిరియాపై సుంకం విధించగా.. పాక్, బంగ్లాపై సుంకాలను తగ్గించారు. పాకిస్తాన్‌పై 29 నుంచి 19 శాతానికి, బంగ్లాదేశ్‌పై 35 నుంచి 20 శాతానికి సుంకాలను తగ్గించారు. ఈ రెండు దేశాలకు సుంకాల విషయంలో మినహాయింపు ఇవ్వడం వల్ల అవి ఆర్థికంగా లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా పడిపోయిన పాక్ దేశం మళ్లీ పుంజుకుంటుంది. అలాగే బంగ్లాదేశ్ తన వస్త్ర పరిశ్రమను బలోపేతం చేసుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం. అయితే ట్రంప్ సుంకాల విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు భారీ మినహాయింపు ఇవ్వడం భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు కూడా భారత్‌కు పొరుగున ఉన్న దేశాలే.
ఇది కూడా చూడండి: Donald Trump Tariffs: ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. ఈ దేశాలపైనే అత్యధిక టారిఫ్‌లు..?
భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే కాదు.. గతంలో కూడా భారత్‌పై కఠినంగా వ్యవహరించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఆయన పదే పదే విమర్శించారు. ఈ క్రమంలోనే భారత్‌కు ఉన్న 'జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్' సుంకాల మినహాయింపు పథకాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు సుంకాల మినహాయింపు ఇవ్వడం వెనుక కుట్ర ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ భారత్‌లో 25 శాతం సుంకం విధించారు. దీనివల్ల భారత్‌లో ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వాటి డిమాండ్ కూడా పూర్తిగా తగ్గుతుంది.
Donald Trump’s tariff chart out: India unchanged at 25%, Pakistan drops to 19%, Bangladesh to 20%. See full list https://t.co/sOS08N6wCE
— Business Today (@business_today) August 1, 2025
చమురు ఒప్పందం
పాకిస్థాన్‌తో డొనాల్డ్ ట్రంప్ చమురు ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో పాకిస్థాన్ చమురును భారత్‌కు విక్రయించవచ్చని ఆయన అన్నారు. అయితే పాక్ చమురు సాయంతో భారత్‌కు అధిక ధరలకు విక్రయించడం వల్ల అమెరికాకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే పాక్‌తో చమురు ఒప్పందం కుదుర్చుకోవడం, దాయాది దేశం, బంగ్లాదేశ్‌కు మాత్రమే సుంకం మినహాయింపు ఇవ్వడంతో మూడు దేశాలు కలిసి భారత్‌పై కుట్ర పన్నుతుందని భావిస్తున్నారు.
ఆసిమ్ మునిర్‌ని విందుకు పిలవడం
డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్‌ని విందుకు పిలిచారు. అయితే భారత్‌కు శత్రు దేశమైన పాక్ అధికారిని విందుకు ఆహ్వానించడంతో కుట్ర ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌తో సుంకాల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించారు. అదే సమయంలో పాక్ సైనిక అధిపతితో భేటీ కావడం వెనుక పాకిస్తాన్‌ను తమకు దగ్గర చేసుకుని, భారత్‌పై కుట్ర పన్నాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Donald Trump: ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ చమురుపై మాకు మాత్రమే హక్కు!