అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌లో భారీ చమురు నిల్వలు ఉన్నాయని వాటిని పెంచుకోవాలని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్పందిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. బలూచిస్తాన్ భూభాగంలో పుట్టిన ప్రతీ సహజ వనరులపై పాకిస్తాన్ లేదా ఇంకా ఇతర ఏ దేశానికి కూడా హక్కు లేదని ట్రంప్‌ను హెచ్చరించింది. విలువైన సంపద కేవలం తమకే చెందుతుందని, పాక్ తన ప్రాంతాన్ని అన్యాయంగా కలుపుకుందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.
ఇది కూడా చూడండి: Donald Trump Tariffs: ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. ఈ దేశాలపైనే అత్యధిక టారిఫ్‌లు..?
We hv heard about trade deals between two parties but never heard of a supper power #USA being fooled to strike a deal with the #BeggarPakistan which does nt have a single barrel of oil.
— Mir Yar Baloch (@miryar_baloch) July 31, 2025
The oil reserves Mr. Trump is referring to r of #RepublicOfBalochistan which is not Pakistan. pic.twitter.com/R2Ta8wV9DG
పాక్ చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా
పాకిస్తాన్‌లో భారీగా ఉన్న చమురు నిల్వలపై ట్రంప్ కన్నేశారు. పాక్‌తో చమురు ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికా దేశానికి ప్రయోజనాలు ఉంటాయని ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి చమురు కొని, దాన్ని భారత్‌కు అమ్మాలని కూడా ట్రంప్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్థికంగా అమెరికాకు ప్రయోజనాలు ఉంటాయని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చమురు నిల్వలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది.
బలూచిస్తాన్‌లోనే చమురు నిల్వలు
చమురు నిల్వలు పాకిస్తాన్ భూభాగంలో లేవని, బలూచిస్తాన్ భూభాగంలో ఉన్నాయని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. తమ ప్రాంతాన్ని పాక్ అన్యాయంగా కలుపుకుందని, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అయితే బెలూచిస్తాన్‌లో భారీగా చమరు నిల్వలతో పాటు సహజ వాయువు, లిథియం, యురేనియం వంటి విలువైన సంపద కూడా ఉందని తెలుస్తోంది. ఇవన్నీ కూడా తమకే సొంతమని, కేవలం బలూచిస్తాన్‌కి మాత్రమే వీటిపై హక్కులు ఉన్నాయని తెలిపింది. తమ ప్రాంత సమగ్రతను కాపాడుకోవడానికి, తమ సహజవనరులను రక్షించుకోవడానికి తాము నిరంతరం పోరాటం కొనసాగిస్తామని బీఎల్‌ఏ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ప్రభుత్వం చైనాతో కలిసి బలూచిస్తాన్ సహజ వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని, దానికి అమెరికా కూడా తోడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఎల్‌ఏ హెచ్చరించింది.
స్వతంత్రంగా ఉన్న దేశం
ఒకప్పుడు బలూచిస్తాన్ ప్రాంతం స్వతంత్రంగా ఉండేది. కానీ 1948లో పాకిస్తాన్ బలవంతంగా తనలో కలుపుకుందని సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమకు స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు, పాక్‌కు ఎలాంటి సంబంధం లేదని, పాక్ ప్రభుత్వం బలూచిస్తాన్ ధనాన్ని దోచుకుంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ చమురు నిల్వల గురించి వ్యాఖ్యలు చేస్తే బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఇది కూడా చూడండి:Trump: భారత్‌పై పగబట్టిన ట్రంప్ పాక్‌తో వ్యాపారం.. ఇండియా పై సెటైర్లు