BIG BREAKING: భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం సుంకాల ప్రకటన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు పేల్చారు. భారత్‌పై మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు 25 శాతం ప్రకటించగా మొత్తం కలిపి 50 శాతం సుంకాలు విధిస్తున్నారు.

New Update
Trump Tariffs

Trump Tariffs

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు పేల్చారు. భారత్‌పై మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు 25 శాతం ప్రకటించగా మొత్తం కలిపి 50 శాతం సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించినట్లు అధ్యక్షుడు ట్రంప్ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో తెలిపారు. దీని ప్రకారం వర్తించే చట్టానికి అనుగుణంగా, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలోకి దిగుమతి చేసుకున్న భారతదేశ వస్తువులు 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నామని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Nikki Haley: భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దు..ట్రంప్ కు నిక్కీ హేలీ వార్నింగ్..

చెప్పినట్లుగానే టారిఫ్‌ల బాంబు పేల్చిన ట్రంప్

ఇదిలా ఉండగా వచ్చే 24 గంటల్లో భారత్‌పై సుంకాలు భారీగా పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెప్పినట్లుగానే 24 గంటల్లో భారత్‌పై సుంకాలను 25 శాతం పెంచారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇలా భారత్ ఉక్రెయిన్ యుద్ధానికి సాయం చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దీనివల్లే ట్రంప్ సుంకాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య మంచి స్నేహ భావం ఉందని, కానీ వాణిజ్య విషయంలో అసలు ఇరు దేశాల మధ్య ఆ బంధం లేదని ట్రంప్ ఇటీవల అన్నారు.

అమెరికాతో వ్యాపారం చేస్తుందని..

భారత్ అమెరికాతో భారీగా వ్యాపారం చేస్తుందన్నారు. కానీ అమెరికా మాత్రం చేయడం లేదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే ట్రంప్ విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ట్రంప్ తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతీసారి భారత్‌పై సుంకాలు పెంచుతూనే ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. 

ఇది కూడా చూడండి: Trump: నాకేం తెలియదు..నేనలా అనలేదు..ట్రంప్ రెండు నాలుకలు

Advertisment
తాజా కథనాలు