/rtv/media/media_files/2025/08/07/tariff-war-2025-08-07-17-57-21.jpg)
Trump's Tariff War
ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు(Trump Tariffs) విధించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు 25 శాతం విధించగా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంలో తాజాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఈ అదనపు 25 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ భారత్‌తో సహా 70 దేశాల్లో అదనపు సుంకాలు విధించారు. సిరియాపై 41 శాతం టారిఫ్ విధించగా.. బ్రెజిల్‌పై ఉన్న 10 శాతం సుంకాలకు మరో 40 శాతం కలిపారు. పాకిస్థాన్‌కు మాత్రం 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించారు. భారత్‌కు 50 శాతం పెంచుతూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ట్రంప్ సుంకాల వల్ల ఆయా దేశాలకే కాకుండా అమెరికాకు కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం
అమెరికాలో పెరగనున్న ఖర్చులు
అమెరికా(USA) లో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచితే ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనివల్ల అమెరికా ప్రజలు కూడా ఆ వస్తువులను ఎక్కువ ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది. భారత్, చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్స్, కార్ల విడిభాగాలు, రెడీమేడ్ దుస్తులు, స్మార్ట్‌ఫోన్లు ఇతర వస్తువల ధరలు భారీగా పెరుగుతాయి.
కొనుగోలు శక్తి తగ్గడం
అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. దీనివల్ల అక్కడి ప్రజలకు తమ అవసరాలకు తక్కువగా ఖర్చు చేస్తారు. చివరికి ఇది ఆర్థిక మాంద్యానికి కూడా దారితీస్తుంది.
అమెరికాపై ప్రతికార సుంకాల ప్రభావం
అమెరికా భారత్‌తో సహా 70 దేశాలపై సుంకాలు పెంచింది. దీనివల్ల ఆయా దేశాలు కూడా అమెరికా దిగుమతి వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో వాటి ధరలు పెరిగి, విదేశీ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుతుంది. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ అమెరికాకు చెందిన మోటారు సైకిళ్లు, ఇతర ఉత్పత్తులపై సుంకాలు విధించాయి. దీంతో హార్లీ డేవిడ్‌సన్ వంటి పలు అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తులను వేరే దేశాలకు తరలించాలని నిర్ణయించుకున్నాయి.
Also Read : భారత్‌పై భారీ సుంకాల వేళ.. అమెరికాకు మరోసారి పాక్ ఆర్మీ చీఫ్.. అసలేం జరుగుతోంది?
ఉద్యోగ నష్టాలు
అమెరికాపై ప్రతికార సుంకాల ప్రభావంతో ఎగుమతులు తగ్గుతాయి. దేశీయంగా వస్తువుల ధరల పెరుగుతాయి. దీనివల్ల అమెరికాలో కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే పలు కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఛాన్స్ ఉంటుంది. చివరికి అమెరికాలో నిరుద్యోగం పెరిగే ప్రమాదముంది.
వాణిజ్య సంబంధాల క్షీణత
సుంకాలు, ప్రతీకార సుంకాలతో అమెరికాకు దాని వాణిజ్య భాగస్వాముల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ఇది దీర్ఘకాలం ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్‌పై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకం విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడనుంది. భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు కూడా అమెరికాతో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపవు. దీనివల్ల అమెరికా వాణిజ్య సంబంధాలు క్షీణించే అవకాశం ఉంటుంది.
ప్రపంచ సరఫరా గోలుసుకు అంతరాయం
ట్రంప్ టారిఫ్‌ల పెంపు వల్ల కంపెనీలు తమ సరఫరా గొలుసును మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చైనా, భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులు అమెరికాకు కాకుండా వాటిని ఇతర దేశాలకు మళ్లించవచ్చు. ఇది గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి పరిస్థితులకు దారితీస్తాయి. మొత్తానికి ట్రంప్ టారిఫ్‌లు అమెరికాకు ఆర్థికంగా, అలాగే దౌత్యపరంగా కూడా నష్టాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.