Trump: భారత్‌పై పగబట్టిన ట్రంప్ పాక్‌తో వ్యాపారం.. ఇండియా పై సెటైర్లు

ఇండియా శత్రుదేశంతో కలిసి బిజినెస్ చేయడానికి ట్రంప్ రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌తో కీలకమైన చమురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్‌లో పాక్, ఇండియాకి చమురు అమ్మవచ్చని అన్నారు.

New Update
Trump

Trump

భారత్‌పై ట్రంప్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడు. రష్యాతో మనం ఆయుల్, ఆయుధాల బిజినెస్ చేస్తుండటంపై అక్కసు వెల్లగక్కుతున్నాడు. ఇందులో భాగంగానే ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధించాడు. అవి రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. అంతేకాదు ఇండియా శత్రుదేశంతో కలిసి బిజినెస్ చేయడానికి ట్రంప్ రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌తో కీలకమైన చమురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లోని అపారమైన చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి అమెరికా, పాకిస్తాన్‌లు కలిసి పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన భారత్‌పై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత వెలువడటం గమనార్హం.

Also Read :  వరదల్లో కొట్టుకుపోయిన 20Kgల బంగారం.. వీధులన్నీ గాలిస్తున్నారు

భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్తాన్ చమురు ఎగుమతి

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో ఈ ఒప్పందం వివరాలను పంచుకుంటూ, "పాకిస్తాన్ దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నాం. పాకిస్తాన్, అమెరికా కలిసి అక్కడి భారీ చమురు వనరులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం" అని తెలిపారు. అంతేకాకుండా, ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్‌కు కూడా చమురు అమ్ముకోవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "ఎవరు చెప్పగలరు, ఒకరోజు భారత్‌కు పాకిస్తాన్ చమురును అమ్మవచ్చేమో!" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Also Read :  భారత్ పై 25 శాతం సుంకాలు.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొంటున్నామనే బాధ

ఈ ప్రకటన భారత-పాకిస్తాన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. రష్యాతో భారత్ ఇంధన కొనుగోళ్లను ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో, ఈ కొత్త ఒప్పందం ప్రాంతీయ వాణిజ్య సమీకరణలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ చమురు భాగస్వామ్యంపై ఇరు దేశాల స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

latest-telugu-news | oil | pakistan | trump business with pakistan | america trade with pakistan | telugu-news | Donald Trump | international news in telugu | national news in Telugu

Advertisment
తాజా కథనాలు