వెక్కి వెక్కి ఏడుస్తూ.. అతనితో నేను.. ! | Janulyri Emotional Comments On Social Media Trolls | RTV
పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తేల్చి చెప్పింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.బార్లో అశ్లీల డ్యాన్స్ చేసినందుకు అభియోగం మోపబడిన 7గురు మహిళలను నిర్ధోషులుగా ప్రకటించింది.
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య, సాయి పల్లవి స్టేజ్‌పై స్టెప్లు వేశారు. హైలెస్సా, శివ శక్తి పాటలకు ఇద్దరూ లైవ్‌లో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో మాత్రమే ఎక్కువగా డ్యాన్స్ చేసే చైతన్య బయట పెద్దగా డ్యాన్స్‌లు వేయరు.
ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు.
భారత నాట్యం అంటే అందరికీ అంత సులభం కాదు. నిండు గర్భిణిగా ఉన్నా యాజ్ఞికా అయ్యంగార్ దాదాపు గంట పాటు ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమెకున్న నైపుణ్యం, దశాబ్దానికిపైగా డ్యాన్స్ అనుభవం, పట్టుదలతో ఇలా డ్యాన్స్ చేసి రికార్డ్ సృష్టించారు.
సమంత 'సిటాడెల్' వెబ్ సీరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ముంబైలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో సామ్, వరుణ్ ధావన్ 'నైన్ మటక్కా' పాటకు డాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.