/rtv/media/media_files/2025/01/25/boEsKNqd0NKvNlr2iZpO.jpg)
Minister Sitakka danced to DJ Tillu song
Seethakka Dance: ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. యువతీయువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?
రోడ్డు ప్రమాదాలపై అవగాహన..
డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క డాన్స్..
— Sateesh Vinjam (@Sateesh_Vinjam) January 25, 2025
🔹ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు...
🔹 యువతీయువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు...@seethakkaMLA pic.twitter.com/dnvyHfkuxJ
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సస్పెన్షన్‌తోపాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని హెచ్చరించారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, స్కీముల అమలులో విచక్షణ, మానవత్వం మరవొద్దని చెప్పారు. మంచిర్యాలలో ఓ వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద రుద్దితే కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
అలాగే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సీతక్క.. పీఆర్, ఆర్డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్ లైన్ గ్రీవెన్స్ చేపట్టినట్టు తెలిపారు. ఇకపై సచివాలయం చుట్టూ తిరగకుండానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సిబ్బంది సర్వీస్ మ్యాటర్, సమస్యల ఫైల్స్ పెండింగ్ లో పెట్టొద్దని, ఫైల్స్ క్లియర్ చేయాలని ఆదేశించారు సీతక్క.