Dance Pe Chance: గడ్డకట్టే చలిలో 870 మంది చిన్నారుల నృత్య ప్రదర్శన.. న్యూజెర్సీలో ‘డ్యాన్స్ పే ఛాన్స్’ వేడుకలు!

అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన 43వ 'డ్యాన్స్ పే ఛాన్స్' కార్యక్రమం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా 870 మంది భారతీయ చిన్నారులు తమ ప్రతిభను చాటారు.

New Update
Dance Pay Chance

Dance Pay Chance

అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన 43వ 'డ్యాన్స్ పే ఛాన్స్' కార్యక్రమం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా వందలాది మంది భారతీయ చిన్నారులు తమ ప్రతిభను చాటారు. భారతీయ సంస్కృతిని, కళలను విదేశాల్లో విస్తరించేందుకు ఈ నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగిన సమయంలో న్యూజెర్సీలో వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువకు పడిపోవడమే కాకుండా.. విపరీతమైన చల్లని గాలులు వీస్తున్నాయి. ఇలాంటి గడ్డకట్టే చలిలో ప్రయాణం చేయడమే కష్టం. అలాంటిది 870 మంది చిన్నారులు ఈ వేడుకలో డ్యాన్స్ వేశారు. 

ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

 ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మరింత వైభవంగా డ్యాన్స్ పే ఛాన్స్..

భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా నృత్య ప్రదర్శన చేశారు. సుమారు 43 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ 'డ్యాన్స్ పే ఛాన్స్' వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరిగాయి. వివిధ వయస్సుల వారు విభిన్న బృందాలుగా ఏర్పడి భారతీయ శాస్త్రీయ, జానపద, బాలీవుడ్ పాటలకు నృత్యాలు చేశారు. రంగురంగుల దుస్తులు, అద్భుతమైన కొరియోగ్రఫీతో వేదికపై భారతీయ కళా వైభవాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పిల్లల తల్లిదండ్రులు కూడా సహకారం చేశారు. ఎన్నో వారాల నుంచి కష్టపడి పిల్లలను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు. భారతీయ మూలాలను మరిచిపోకుండా పిల్లల్లో దేశభక్తిని, కళలపై ఆసక్తిని పెంచడంతో పలువురు వారికి అభినందనలు తెలుపుతున్నారు. 

ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు