Trump Dance: ఉత్సాహంగా అమెరికా అధ్యక్షుడు..మలేసియా రెడ్ కార్పెట్‌ వెల్కమ్‌లో డాన్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టైలే వేరు. ఎక్కడ ఉన్నా అక్కడ తన మార్క్ చూపిస్తారు.  ఈ రోజు మలేసియా పర్యటనకు వచ్చిన ఆయన రెడ్ కార్పెట్ స్వాగతంలో తన సిగ్నేచర్ స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. 

New Update
trump dance

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సరదా అయిన మనిషి. ఆయనకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సందర్భం వచ్చినప్పుడల్లా బహిరంగంగానే స్టెప్‌లు వేస్తుంటారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ స్టెప్‌లు చాలా పాపులర్ కూడా అయ్యాయి. తాజాగా మలేసియా పర్యటనకు వచ్చిన ట్రంప్...రెడ్ కార్పెట్ వెల్కమ్‌లో తన స్టెప్‌లతో అక్కడ ఉన్నవారందరిలో ఉత్సాహం నింపారు. 

డాన్స్ చేసిన అధ్యక్షుడు..

ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఈరోజు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన అధ్యక్షుడికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ నుంచి కిందకు దిగగానే ఆయనకు మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం  స్వాగతం పలికారు. దాంతో పాటూ వారి సాంప్రదాయ నృత్యం చేస్తూ కొందరు ట్రంప్ కు వెల్కమ్ చెప్పారు.  వాళ్ళను చూసి అధ్యక్షుడికి కూడా ఉత్సాహం వచ్చింది. ఆ ట్రూప్ తో కలిసి ఆయన కూడా స్టెప్ లు వేశారు. తన స్టైల్ సిగ్నేచర్ స్టెప్ వేశారు. దానికి మలేసియా ప్రధాని కూడా చిన్నగా కాళ్ళు కదిపారు. 

ఆసియాన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్‌ ఈ సదస్సుకు హాజరయ్యారు. జపాన్‌ కొత్త ప్రధాని తకాయిచి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, దక్షిణ కొరియా నేతలు కూడా హాజరుకానున్నారు. దీనికి భారత ప్రధాని మోదీ కూడా హాజరు కావాల్సి ఉండగా..టైట్ షెడ్యూల్ వల్ల క్యాన్సిల్ అయింది.  ప్రధాని మోదీ బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అయితే మోదీ వర్చువల్‌గా సదస్సుల్లో పాల్గొంటారు. శిఖరాగ్ర సమావేశానికి మలేసియా వెళ్ళే ముందు ప్రధాని మోదీ కంబోడియా కూడా సందర్శించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పర్యటన కూడా వాయిదా పడింది. 

10 దేశాలతో ఆసియాన్ కూటమి..

ఈ ఆసియాన్‌ కూటమిలో మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు రెండేళ్ళకొకసారి ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించి సదస్సును నిర్వహిస్తాయి. కొన్నేళ్ళుగా ఈ అన్ని దేశాలతో భారత్ మంచి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడి రంగాలతో పాటు భద్రత, రక్షణల్లో సహకారంపై కలిసి పని చేస్తున్నాయి. 

Also Read: Pakistan: సల్మాన్‌ఖాన్‌పై పాకిస్తాన్ ఆగ్రహం..ఉగ్రవాదిగా ప్రకటన

Advertisment
తాజా కథనాలు