/rtv/media/media_files/2025/05/30/VY2G5yrbr8YpuuOIOV5j.png)
Indian Wedding Barat in Wall Street
Indian Wedding Baraat in Wall Street:
భారతీయ పెండ్లి సంప్రదాయంలో బరాత్‌ది(Baraat) ఒక ప్రత్యేక స్థానం. పెండ్లిలో భోజనం పెట్టినా పెట్టకపోయినా బరాత్ మాత్రం జోర్దార్‌గా జరగాల్సిందే. మనదేశంలో ఇది ఒకట్రెండ్. కానీ మనట్రెండ్ విదేశాల్లో దర్శనమిస్తే ఆ కిక్కే వేరు కదా! అలాంటిదే న్యూయార్క్‌లోని ఫైనాన్షియల్ స్ట్రీట్‌గా పేరుగాంచిన వాల్‌స్ట్రీట్‌లో మన బరాత్ జరిగితే ఎలా ఉంటుంది. పోదా... అదిరిపోదా.. అదిరిపోయింది కూడా..
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
న్యూయార్క్ నగరంలోని వాల్‌స్ట్రీట్ ఓ భారతీయ జంట పెండ్లి బరాత్‌తో ఊగిపోయింది. భారతీయ సంప్రదాయ బ్యాండ్ మేళాతో 400 మంది వీధుల్లో(Foreign Streets) ధూంధాం చేశారు. వారి డ్యాన్స్‌లతో(Dance) వాల్‌స్ట్రీట్ కాస్తా..బరాత్ వేదికగా మారింది. ఈ వేడకకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పెండ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులతో పాటు వధూవరులు ఇద్దరూ రంగురంగుల దుస్తులు ధరించి బాలీవుడ్ పాటలకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
A Grand Baraat Takes Over Wall Street: A Celebration of Indian Splendour
— NewsNowNation (@NewsNowNation) May 30, 2025
How Does a Vibrant Indian Wedding Procession Redefine New York’s Financial Hub?
In an extraordinary display of cultural pride, a lavish Indian wedding baraat brought New York’s iconic Wall Street to a… pic.twitter.com/CP3j7UMKIi
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ స్ట్రీట్‌గా పేరున్న వాల్‌స్ట్రీట్‌లో ఈ వేడుక హుషారు రేకెత్తించింది. ఫైనాన్షియల్ హబ్ డ్యాన్స్‌లతో హోరెత్తింది. భారతీయ సంప్రదాయ నృత్యాలు ప్రపంచవేదికపై దర్శనమిచ్చింది.సంస్కృతి సాంప్రదాయలకు నిలయమైన భారత దేశపు పెండ్లి వినోదాన్ని చూసి అమెరికా(America) వాసులు ఆనందంతో ఊగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులు మన సంప్రదాయం లో వివాహం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటిది అమెరికాలోనే మన పెండ్లి బరాత్‌తో వారు మరింత ఆకర్శితులయ్యారు. ఈ వేడుక కొద్దిసేపట్లోనే ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. వాల్‌స్ట్రీట్‌లో ఇలాంటి నృత్యవేడుక జరుగుతుందని ఎవరూ ఊహించ లేదని.. జీవితంలో ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయని ఈ వేడుకను నిర్వహించిన డీజే ఏజే ఇన్‌స్టా పోస్ట్‌లో కామెంట్ చేయడం గమనార్హం.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
The Global Presence and Dominance of Indians .
— Dr.Monika Langeh (@drmonika_langeh) May 30, 2025
Wall Street Shut down for 400 people Baraat… Indian Wedding in US 😁 pic.twitter.com/tZsHJ1wPFO
One can only imagine the $$$ they paid to close off a block of Wall Street, but this was damn fun to watch.#WallStreet #StockMarket #Nasdaq #nyse #stockmarketsindia #weddingparty #weddingday #InvestSmart pic.twitter.com/VirvXZrd3I
— Abhishek Singhania (@TradeNinvesting) May 29, 2025