Dance: వామ్మో.. 9 నెలల గర్భంతో భరతనాట్యం

భారత నాట్యం అంటే అందరికీ అంత సులభం కాదు. నిండు గర్భిణిగా ఉన్నా యాజ్ఞికా అయ్యంగార్‌ దాదాపు గంట పాటు ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమెకున్న నైపుణ్యం, దశాబ్దానికిపైగా డ్యాన్స్ అనుభవం, పట్టుదలతో ఇలా డ్యాన్స్‌ చేసి రికార్డ్‌ సృష్టించారు.

New Update
pregnant

Bharatanatyam Dance

Dance: సాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు ఏమీ పనులు చేయనివ్వరు కుటుంబ సభ్యులు. కొందరు వైద్యులు మాత్రం కొన్ని నెలల గర్భం వరకు చిన్నచిన్న వ్యాయామాలు చేయొచ్చని చెబుతుంటారు. ఓ భరత నాట్య కళాకారిణి మాత్రం ఏకంగా 9 నెల గర్భంతో గంట పాటు భరత నాట్య ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉపాధ్యాయురాలు యాజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే మాతృత్వం అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. 

దాదాపు గంట పాటు ప్రదర్శన:

అయితే.. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని బిడ్డ కూడా లయబద్ధంగా తన్నడాన్ని అనుభవించినట్లు అయ్యంగార్‌ చెబుతున్నారు. అంతేకాకుండా నిండు గర్భిణిగా ఉన్నా దాదాపు గంట పాటు ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. భరత నాట్యం అంటే అందరికీ అంత సులభం కాదు. నృత్యకారులు తీవ్రమైన శారీరక శ్రమతో ఈ నృత్యం చేయాల్సి ఉంటుంది. సృష్టి సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ థెరపీ డైరెక్టర్ ఎ.వి.సత్యనారాయణ ప్రోత్సాహంతో అయ్యంగార్ యోగా థెరపీలో ఆమెకున్న నైపుణ్యం, దశాబ్దానికిపైగా డ్యాన్స్ అనుభవంతో ఈ ప్రదర్శన ఇచ్చారు. 

కదలికలను కూడా అయ్యంగార్‌ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. బిడ్డ భద్రతను దృష్టిలో ఉంచుకుని భరతనాట్యం చేశారు. రాగం లేదా కదలిక నచ్చకపోతే తనకు వికారంగా అనిపించేదని, ఒకవేళ తాను ఏదైనా రాగం ఎంచుకుంటే తన కడుపులోని బిడ్డ కూడా తన్నేదని, నా బిడ్డ నా కంపోజర్‌ అని యాజ్ఞికా అయ్యంగార్‌ చెబుతున్నారు. అయ్యంగార్ గర్భవతిగా ఉన్నప్పుడు శారీరక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఇలా గర్భంతో డ్యాన్స్‌ చేయడం ప్రమాదకరం, మామగారు కూడా వారం క్రితమే మరణించినా అయ్యంగారు కుమిలిపోకుండా పట్టుదలతో ఇలా డ్యాన్స్‌ చేసి రికార్డ్‌ సృష్టించారు.

ఇది కూడా చదవండి: ఉసిరికాయ మిఠాయితో అనేక ప్రయోజనాలు

Advertisment