Delhi: పొట్టి దుస్తులు ధరించండంపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదని ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు తేల్చి చెప్పింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.బార్‌లో అశ్లీల డ్యాన్స్‌ చేసినందుకు అభియోగం మోపబడిన 7గురు మహిళలను నిర్ధోషులుగా ప్రకటించింది.

New Update
Wearing small clothes not a crime, Says Delhi Court

Wearing small clothes not a crime, Says Delhi Court

సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో కొందరు పొట్టి దుస్తులు ధరిస్తుంటారు. అయితే దీనిపై ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇలా దుస్తులు ధరించడం నేరం కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలోని బార్‌లో అశ్లీల డ్యాన్స్‌ చేసినందుకు గాను గత ఏడాది అభియోగం మోపబడిన 7గురు మహిళలను న్యాయస్థానం నిర్ధోషులుగా ప్రకటించింది. 

Also Read: ఈవీఎంలపై అనుమానాలు.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఢిల్లీలోని ఓ బార్‌లో యువతులు పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో ఆ బార్‌వైపు పెట్రోలింగ్‌ వెళ్లిన పోలీసులు ఆ మహిళలను చూశారు. దీంతో వాళ్లపై పహర్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బార్‌లో పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి నిందితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చిన్న దుస్తులు ధరించడం నేరం కాదని ప్రకటిస్తూ వాళ్లని నిర్ధోషులుగా తేల్చింది.  

Also Read: మణిపుర్‌ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు

అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యారా? అనేదాన్ని పోలీసులు నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. పోలీసుల ఫిర్యాదుకు ఎలాంటి విలువ లేదని చెప్పింది. అలాగే ఈ కేసులో నేరం జరిగిందని నిరూపించడంలో పూర్తిగా విఫలమైనట్లు చెప్పింది. పోలీసులు దీనిపై కల్పితాలు సృష్టించినట్లు స్పష్టంగా తెలుస్తోందని మండిపడింది. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమేం కాదని.. వారివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితేనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Also Read: మణిపుర్‌ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు