Karimnagar Cyber Crime Latest | ఇతన్ని చూసైనా మారండి బాబూ... వంద ఇచ్చి రూ.6లక్షలు కొట్టేశారు | RTV
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.15 లక్షలు దోచేశారు. మీ పేరు మీద మనీలాండరింగ్ జరిగిందంటూ బాధితున్ని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి బాధితుడి నుంచి డబ్బులు కొట్టేశారు.
హైదరాబాద్ లో ఓ నటిని నమ్మించి బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో జీవితకాలం పనిచేసే కార్డును రూ.50,500కు అందిస్తున్నామని సినీనటి మహిమా గౌర్ ను నమ్మించి కొంత డబ్బును కాజేశారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
డిజిటల్ అరెస్టు మోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 71ఏళ్ళ వృద్ధుడి నుంచి 1.4 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని.. బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోయాడు. మీ పేరుతో డ్రగ్స్ కేసు నమోదైందని పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. ఆపై డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి రూ.2 కోట్లు కొట్టేశారు.
టెక్స్టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీ ఓస్వాల్ సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు. సీజేఐ చంద్రచూడ్ విచారిస్తున్నట్లు కోర్టు సెట్టింగ్ వేసి రూ.7 కోట్లు కొట్టేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులను పట్టుకుని రూ.5.25 కోట్లు తిరిగి రాబట్టారు.
సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. సుప్రీం కోర్టు ఇండియా పేరుతో ఉండే ఛానల్‌ను రిప్పల్ అని మార్చారు. ఇందులో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు కాకుండా.. క్రిప్టో కరెన్సీ కంటెంట్ గురించి వస్తున్నాయని గుర్తించారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ, ఎవరూ హ్యాక్ చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టింది.
అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన జిల్లా జడ్జికి సైబర్ నేరగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. వాట్సప్ డీపీలో హైకోర్టు జడ్జి ఫొటో వాడుకుని రూ.50 వేలు దోచేశారు. ఇదే అదనుగా మరిన్ని డిమాండ్స్ చేయడంతో న్యాయమూర్తి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.