71 ఏళ్ళ వృద్ధుడికి కుచ్చుటోపి.. 1.4 కోట్ల రూపాయలు దోచేసిన కేటుగాళ్లు!

డిజిటల్ అరెస్టు మోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 71ఏళ్ళ వృద్ధుడి నుంచి 1.4 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని.. బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.

New Update
digital arrest

digital arrest

Digital Arrest : సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్టు అంటూ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. డిజిటల్ అరెస్ట్‌ పేరుతో అమాయకులను భయపెట్టి కోట్లల్లో డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా ఈ సైబర్ కేటుగాళ్లమోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 

Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!

రూ. 1.4 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్ళు 

అనకాపల్లి నర్సిపట్టణానికి చెందిన 71 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి నుంచి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముందుగా నేరగాళ్లు.. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగింది. అందుకే మీరు డిజిటల్ అరెస్టు అయ్యారు అంటూ ఫోన్లో వృద్ధుణ్ని బెదిరించారు. ఈ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు చెల్లించాలని బెదిరించారు. దీంతో భయపడిపోయిన వృద్ధుడు.. బ్యాంక్ లో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులన్నీ విత్‌డ్రా  చేసి నేరగాళ్లకు పంపించాడు. రూ.1.4 కోట్లను మూడు రోజుల వ్యవధిలో నేరగాళ్లు చెప్పిన ఖాతాకు జమ చేశాడు వృద్ధుడు. 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

ఆ తర్వాత రెండు మూడు రోజులకు తాను మోసపోయినట్లు గుర్తించాడు వృద్ధుడు. 12 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు  వృద్ధుడు పంపిన డబ్బు విత్‌డ్రా కాకుండా చేసినట్లు తెలిపారు. అలాగే నేరగాళ్ళను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read :  కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు