మణిపూర్‌లో ముగ్గురు పిల్లల తల్లిపై అత్యాచారం.. అనంతరం సజీవ దహనం
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు.
కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో జరిగింది. కొడుకు డిగ్రీ మానేసి, జులాయిగా తిరుగుతున్నాడని కూరగాయల కత్తితో తండ్రి పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
సిద్ధిపేట జిల్లాలో ZPPS చుంచనకోటలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న ధర్మారెడ్డి బైక్‌పై ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో సడెన్‌గా కోతి అడ్డం వచ్చింది. దాంతో బైక్ అదుపు తప్పడంతో ధర్మారెడ్డి తలకు బలమైన గాయం అయ్యి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ఫోన్ నెంబర్ ను 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయన్నారు. అలా బాధితుడి నుంచి రూ.2.29 కోట్లు బదిలి చేయించుకున్నారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.