Medak: వీడియో కాల్ మాట్లాడుతూనే.. మహిళ ఏం చేసిందంటే?

భర్త ఇంట్లో ఉండగానే వీడియో కాల్ మాట్లాడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న దూలానికి చీరను కట్టి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాటలు వినిపించకపోయే సరికి భర్త గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించింది.

New Update
వరుసగా విద్యార్థినిల సూసైడ్స్, ఆందోళనలో పేరెంట్స్!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనతో పాటు రోజూ ఉన్న వ్యక్తులే ఒక్కసారిగా చనిపోతున్నారు. ఎక్కువగా చదువు, లైంగిక వేధింపులు, పరీక్షల్లో ఫెయిల్, ఉద్యోగం రాలేదని, అప్పు ఎక్కువగా ఉందని, ప్రేమలో విఫలం అయ్యారని వంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళ వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుంది. 

ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!

వీడియో కాల్ మాట్లాడుతుండగానే..

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామానికి చెందిన ఎల్లంపల్లి లావణ్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. భర్త ఇంట్లోనే ఉండగా.. వేరే వాళ్లతో ఆమె వీడియో కాల్ మాట్లాడుతోంది. ఇలా మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న దూలానికి చీరను కట్టి ఉరేసుకుంది. కొంత సమయం తర్వాత తన మాటలు వినిపించకపోయే సరికి భర్త గమనించగా.. ఉరేసుకుని కనిపించింది.

ఇది కూడా చూడండి: US: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

వెంటనే ఆమెను కిందకి దించి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. అయితే ఏ కారణం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందో కారణాలు తెలియవు. భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చివరిగా ఆమెతో ఓ వ్యక్తి వీడియో కాల్ మాట్లాడారు. అతని వల్ల ఆమె చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్‌

ఆమె చివరిగా ఎవరితో మాట్లాడిందో అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు అతను ఇంతకీ, వీడియో కాల్ మాట్లాడుతుండగానే ఆత్మహత్య ఎందుకు చేసుకుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు