/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Massive-encounter-in-Telangana.-Three-Maoists-killed-jpg.webp)
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవల మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులను తర్రెం, బాసగుడ ప్రాంతాల్లో ఉన్న ముగ్గురిని పోలీస్ ఇన్‌ఫార్మర్లతో చంపారు. దీంతో డీఆర్జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఎదురు పడటంతో ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి. సీఎస్‌ఎం జనతన సర్కార్ అధ్యక్షుడు సోమదా కల్ము, ఆర్‌పీసీ ఉపాధ్యక్షుడు కవాసి హంగా ఈ కాల్పుల్లో మరణించినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన తుపాకులు, బాంబులను కూడా బలగాలు తీసుకున్నారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
కూంబింగ్ నిర్వహిస్తుండగా..
ఇదిలా ఉండగా ఇటీవల కూడా 12 మంది మావోయిస్టులు మరణించారు. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్ అబూజ్ మడ్ అడవిప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. నారాయణపూర్, దంతేవాడ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురు కాల్పులు జరిగాయి.
ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!
అలాగే మంగళవారం కూడా బీజాపూర్ అటవీ ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి ముంగా గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టును పోలీసులు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లాగా గుర్తించారు. మావోయిస్టు పార్టీలోని నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లుతో పాటు దాదాపు 30నుంచి 40 మంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లుగా సమాచారం అందడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..
ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన