UP Crime: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భార్య దారుణ హత్య

ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్న భార్యను భర్త గొంతు కోసి చంపాడు. న్‌స్టాగ్రామ్‌‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కామెంట్స్, కాల్స్ రావడమే ఇందుకు కారణం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
pakala beach

Instagram Reels

Instagram Reels: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది. సోషల్ మీడియా వచ్చాక క్షణాల్లో  ఏ విషయమైనా తెలియటంతోపాటు కొన్ని దారుణాలు కూడా జరుగుతున్నారు.  ఇన్‌స్టాగ్రామ్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఎంతోమంది టాలెంట్‌తో ముందుకొస్తున్నారు. తాజాగా ఒ ఇన్‌స్టాగ్రామ్స్ పిచ్చి పచ్చని కాపురంలో చిచ్చుబెట్టింది. ఏకంగా ప్రాణాలు తీసిన ఘటన యూపీలో కలకలం రేపుతోంది.

ప్రాణం తీసిన రీల్స్:

ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్న భార్యను పిల్లల ముందే గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌‌కి బానిస,  గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కామెంట్స్, కాల్స్ రావడంతోనే ఆ వ్యక్తి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కంకేర్‌ఖేరా పీఎస్‌ పరిధిలోని శోభాపూర్ అవుట్‌ పోస్ట్ ప్రాంతంలో లఖ్వాయాలో  సీమ, రాజు అనే వ్యక్తి భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. వీరికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వంశిక (10), అన్షిక (6), ప్రియాంషి(3) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

పోలీసుల నివేదిక ప్రకారం.. ఓ రోజుల్లో సీమా ఇన్‌స్టాగ్రామ్‌లో 13 రీల్స్ పోస్ట్ చేసింది. ఈ రీల్స్‌కి కామెంట్స్, లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా గుర్తుతెలియని వ్యక్తి నుంచి తల్లికి ఫోన్‌లు వచ్చిందని పిల్లలు తండ్రికి చెప్పారు. ఇది కోపంతో రెచ్చిపోయిన ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. తర్వాత సీమను రాజు కత్తితో పొడిచి చంపినట్లు చెప్పినట్లు పెద్ద కుమార్తె వంశిక తెలిపింది. 

తల్లిని చంపుతుండగా ముగ్గురు పిల్లలు దుప్పటి కింద దాక్కోని జరుగుతున్న నేరాన్ని భయంతో అలానే చూస్తూ ఉండిపోయారు. దీని అంతటికీ కారణం ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ రావటంతో దంపతులు మధ్య గోడవ జరిగినట్లు తెలిపారు. సీమను ఇటుకతో కొట్టి, గొంతు కోసి చంపి రాజు మొబైల్‌ ఫోన్లను తీసుకుని పరీపోయ్యాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టకి తరలించారు. 

Also Read:  హైబ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. ఆహారంలో ఇవే ముఖ్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు