భారీ ఎన్కౌంటర్.. మరో కీలకనేత మృతి
నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
కర్ణాటక విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈరోజు ఉదయం నేషనల్ హైవే NH-50 పై మణగూళి పట్టణం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.
నాగర్‌కర్నూల్ చెన్నంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ అనే మహిళకు తన ఏడేళ్ల కూతురిని గొంతులు నులిమి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి మడుగులో పడేసింది. కూతురిని మాత్రమే కాదు గతంలో ఎల్లమ్మ తన భర్తను కూడా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ పాతబస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక బోయిగూడలో జీ ప్లస్ 2 భవనంలోని రెండవ అంతస్తులో ఉండే చెప్పుల గోదాంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలి మృతి చెందాడు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని సాంబ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. అక్కడే తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ కలహాలే జవాన్ ఆత్మహత్య కారణమని తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పెట్రోల్ ట్యాంకర్‌కు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ట్యాంకర్‌ను ఆపడం వలన భారి ప్రమాదం తప్పింది.