/rtv/media/media_files/2025/06/16/AE9dfsq3vWQWKjSwGBLf.jpg)
Model Sheetal
Crime News: హర్యానాలోని పానిపట్‌కు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. సోనిపట్ జిల్లాలోని ఖార్ఖోడా ప్రాంతం ఖండా గ్రామం సమీపంలోని రిలయన్స్ కాలువలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది. శీతల్ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితమే పానిపట్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు మొదలైనప్పటికీ.. శీతల్ మృతదేహం జూన్ 15న రాత్రి కాలువ వద్ద దొరకడం అందరినీ షాక్‌కు గురిచేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సివిల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, హత్య కేసుగా దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు.
మోడల్‌ను హత్య చేసింది ఎవరు..?
నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతుందని తెలిపారు. శీతల్, మోడల్‌గా, సోషల్ మీడియా వేదికలపై ప్రాచుర్యం పొందిన ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకుంది. హర్యాన్వీ మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ కోసం ఆమె జూన్ 14న అహర్ గ్రామం వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె సోదరి ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో.. శీతల్, సునీల్ అనే వ్యక్తితో కలిసి కారులో బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. వారు ప్రయాణించిన వాహనం అనుమానాస్పదంగా కాలువలో పడిపోయినట్లు సమాచారం.
सोनीपत में मॉडल शीतल की गला रेतकर हत्या
— Indian Observer (@ag_Journalist) June 16, 2025
नहर के पास बरामद हुआ शव #Sonipat #sheetal #model #murder pic.twitter.com/PRLUcA9yDA
సునీల్‌ను గల్లంతైన స్థలంలో నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించగా.. కారును వెలికితీసిన సమయంలో శీతల్ మృతదేహం బయటపడింది. శరీరంపై తీవ్ర గాయాలున్నట్లు డాక్టర్లు వెల్లడించగా, ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, హత్యే అనుమానంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును సోనిపట్, పానిపట్ పోలీసులు సంయుక్తంగా విచారిస్తున్నారు. శీతల్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు గట్టి ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదవశాత్తు మృతి కాదని, ఆమెను పూర్వనియోజితంగా హత్య చేశారని వారు స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం పోలీసులు సునీల్ పాత్రపై ఆరా తీస్తున్నారు. శీతల్ మరణం వెనుక అసలైన కారణాలేంటో త్వరగా వెలుగులోకి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహిళా ప్యాసింజర్‌ను కొట్టిన ర్యాపిడో డ్రైవర్.. ఇంత దారుణమా..?
( crime news | Latest News | telugu-news | crime | haryana )
ఇది కూడా చదవండి: గీజర్ నీటితో స్నానం చేయడం వల్ల కలిగే చెడు ఇదే