/rtv/media/media_files/2025/06/16/EhLFlJt97QMxwjSJIyfk.jpg)
up Crime News
UP Crime News: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఒక యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రాణహానికీ గురిచేయాలన్న స్థాయికి వెళ్లింది. ఈ ఘటన జూన్ 15న సాయంత్రం చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల ప్రకారం.. హర్దోయ్‌లోని ఓ CNG గ్యాస్ స్టేషన్ వద్ద కారులో వచ్చిన ఒక కుటుంబం రీఫిల్ చేయించేందుకు వచ్చారు. అయితే భద్రతా ప్రమాణాల మేరకు.. గ్యాస్ స్టేషన్ ఉద్యోగి రజనీష్ కుమార్ కారులో కూర్చున్న ఎహ్సాన్ ఖాన్ అనే వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులను కారు దిగమని కోరాడు. కారులో ఎవరూ లేకుండా మాత్రమే రీఫిల్ చేయడం నియమమని తెలిపాడు. కానీ వారు కారులో నుంచే ఉండేందుకు అడ్డంగా నిలబడ్డారు.
కారులో నుంచి రివాల్వర్ తీసుకొని..
రజనీష్ కుమార్ వారి కారులో CNG నింపేందుకు నిరాకరించడంతో వాదన మొదలైంది. ఈ సమయంలో కారులోనే ఉన్న ఎహ్సాన్ ఖాన్ కుమార్తె అరీబా తీవ్రంగా కోపంతో ఊగిపోయింది. అసభ్య పదజాలంతో ఉద్యోగిపై దుర్భాషలు ప్రయోగించడమే కాకుండా.. కారులో నుంచి రివాల్వర్ తీసుకొని రజనీష్ కుమార్‌పై గురిపెట్టింది. ఇత్నీ గోలియాన్ మారుగీకి ఘర్ వాలే పెహచాన్ నహీ పయేగే అంటూ తీవ్రంగా బెదిరించింది. అంటే ఎంతటి బుల్లెట్లు వదిస్తానో.. నీ కుటుంబం కూడా నిన్ను గుర్తించలేరని హెచ్చరించింది. సహజంగా ఏ ఒక్కరు ఇలాంటి సమయంలో భయపడినా ఆశ్చర్యం కాదు. కానీ రజనీష్ మాత్రం ధైర్యంగా అరీబాతో వాగ్వాదం చేశాడు.
Caught on Camera: U.P woman points a gun at petrol pump worker after being asked to step out of the car | #WATCH #Viral #ViralVideo #UttarPradesh #PetrolPump #Gun pic.twitter.com/992Mn3Ho4n
— TIMES NOW (@TimesNow) June 16, 2025
అనంతరం అక్కడి ఇతర సిబ్బంది పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. చివరికి అరీబా తల్లి వచ్చి ఆమెను కారు వైపుకు తీసుకెళ్లింది. ముగ్గురు అక్కడి నుంచి వెళ్తుండగానే ఈ మొత్తం ఘటనను సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పెట్రోల్ బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించారు. ఎహ్సాన్ ఖాన్, అతని కుమార్తె అరీబా, అలాగే ఆమె భర్తపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరీబా వద్ద నుంచి లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు తుపాకీ లైసెన్స్, దాని ఉపయోగాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఇది కూడా చదవండి: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
( crime news | crime | Latest News | up)
ఇది కూడా చదవండి: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి