/rtv/media/media_files/2025/07/25/this-delhi-woman-2025-07-25-08-07-48.jpg)
This Delhi Woman’s Husband Was ‘Not Able To Satisfy Her In Bed’. So She Killed Him
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ (29) తన భర్త (32) పడక సుఖం ఇవ్వడం లేదని, అప్పులు చేశాడనే కారణంతో హత్యకు పాల్పడింది. నిహాల్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఆ తర్వాత ఆమె తన భర్త సూసైడ్ చేసుకున్నాడని నమ్మించేందుకు యత్నించింది. చివరికి ఆమె ఫోన్ హిస్టరీ చూడగా అసలు విషయం బయటపడింది. తన భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !
ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిహాల్ విహార్ ఏరియాలో ఫర్జానా (29), మహమ్మద్ షాహిద్ (32) దంపతులు ఉంటున్నారు. అయితే ఫర్జానా తన భర్తతో సంతోషంగా ఉండేది కాదని పోలీసులకు విచారణలో చెప్పింది. తనను లైంగికంగా తృప్తిపరిచేవాడు కాదని, ఆన్‌లైన్ గ్యాబ్లింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేశాడని తెలిపింది. అంతేకాదు ఆమె తన శారీరక సుఖం కోసం బరేలీలో ఉంటున్న షాహిద్ బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కూడా చెప్పింది.
చివరికి ఇలాంటి వ్యక్తికత, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ హత్యకు దారి తీశాయి. ఆదివారం సాయంత్రం షాహిద్ సోదరుడు సంజయ్ గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే వైద్యులు షాహిద్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో ఫర్జానా అప్పులు ఎక్కువ కావడంతో ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకున్నాడని అతడి సోదరుడికి చెప్పింది. అయితే పోలీసులు షాహిద్ శరీరంలో మూడు కత్తిపోట్లు ఉండటాన్ని గమనించారు. కానీ ఫర్జానా మాత్రం ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురై పొడుచుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఓ గాయం మాత్రం తనంతటా తాను చేసుకుంది మాత్రం కాదని ఓ సీనియర్ పోలీస్ అధికారి గుర్తించాడు.
Also Read: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
చివరికి సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించగా షాహిద్ శరీరంపై ఉన్న గాయాలకు, సూసైడ్‌కు పొంతన లేకుండా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫర్జానా ఫోన్‌ను చెక్ చేశారు. అందులో హిస్టరీ చూడగా.. 'ఎవరినైనా స్లీపింగ్ పిల్స్‌తో ఎలా చంపాలి', 'చాట్ హిస్టరీస్‌ను ఎలా డిలీడ్ చేయాలి' అనేవి కనిపించాయి. చివరికి పోలీసులు తమదైన శైలీలో అడగగా.. ఎట్టకేలకు ఫర్జానా తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. తన వివాహిక జీవితం, భర్త అప్పులతో విరక్తి పొంది ఇలాంటి పనికి పాల్పడ్డట్లు అంగీకరించింది. బరేల్లీకి చెందిన ఫర్జానాకు షాహిద్‌తో 2022లో వివాహం జరిగింది. షాహిద్ వెల్డింగ్ పనిచేసేవాడు. వీళ్ల వివాహం తర్వాత ఫర్జానా గర్భవతి కూడా అయ్యింది. కానీ తన భర్తకు తెలియకుండానే అబార్షన్ చేయించుకున్నట్లు పోలీసులు విచారణలో చెప్పింది.