New Update
/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
Death
మేడ్చల్‌లో దారుణం జరిగింది. ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్‌గా గుర్తించారు. మేడ్చల్‌లోని ఆయన ఓ లాడ్జీలో సెల్ఫీ వీడియో తీసుకొని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటో అందులో వివరించారు. '' నేను నాకున్న అప్పులు తీర్చేశాను. అయినా కూడా ఇంకా బాకీ ఉన్నానని కొందరు నన్ను వేధిస్తున్నారు.
Also Read : మేడ్చల్‌లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
Teacher Commits Suicide
కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు వేసి నాతో పాటు భార్యపిల్లలను కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. నన్ను హత్య చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. వీటన్నింటిని తట్టుకునే శక్తి, ఓపిక నాకు లేదు. అందుకే మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మృతికి కారణమైన వాళ్లని కఠినంగా శిక్షించాలి. నా భార్య, పిల్లలు రోడ్డున పడకుండా సీఎం రేవంత్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదుకోవాలని కోరుతున్నానని'' రమేశ్ తెలిపారు.
ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకొని మరణించారు. మెదక్ జిల్లాలో హవేలి ఘన్‌పూర్ మండలం సర్దన గ్రామంలో రమేశ్ SGTగా పనిచేస్తున్నారు. ఆయన సూసైడ్ చేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయక కుంటుబ సభ్యులు రమేశ్ మృతికి కారణమైన వాళ్లని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
telangana | telugu-news | suicide | crime | medchal
తాజా కథనాలు