/rtv/media/media_files/2025/02/20/uqp7Uv1mdRu67cn0D7S9.jpg)
Ganja
సంగారెడ్డిలో గంజాయి కలకలం సృష్టించింది. జిల్లా కోర్టులో ఓ అధికారి వద్ద హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కొమ్ముల రాజు గంజాయి ప్యాకెట్లతో బైక్ వద్ద నిల్చోని ఉన్నాడు. స్థానికులు అప్పుడు రాజు వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వీరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాజు దగ్గర నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపుగా రూ.80 వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ మీర్పేట్ పీఎస్ పరిధి అల్మాస్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన ఏడు కొండలు కుటుంబం బతుకు తెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు కూడా దివ్యాంగులు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీకాంత్‌తో పెద్ద కుమార్తెకు పరిచయం ఉంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతిపై శ్రీకాంత్ అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పలేక అవమానంతో యువతి బలవన్మరణం చేసుకుంది. బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’