/rtv/media/media_files/2025/03/12/aAigignVzz1KqSaepxNz.jpg)
HYD Crime News
HYD Crime: హైదరాబాద్ నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో 10వ తరగతి చదువుతున్న బాలిక హన్సిక ఐదవ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు మియాపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిగా చదువుతోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి..
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హన్సిక ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకునేందుకు పోలీస్ విచారణ కొనసాగుతోంది. కుటుంబం, మిత్రులు, పాఠశాల అధికారులు అందించనున్న సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకునే శక్తి తక్కువవడం వంటి అంశాలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, సాంకేతిక వనరుల ప్రభావం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆల్‌ఔట్ అవసరమే లేదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే దోమలు పరార్!
చిన్న చిన్న విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తప్పించుకోవాలనే భావనతో పలు నిర్ణయాలు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి ఘటనలు మరల జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనపై క్షణక్షణానికి ఓ కన్నేసి ఉంచాలి. పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని గుర్తించి.. వారికి భరోసా ఇవ్వాలి. ఇంట్లోనూ, పాఠశాలలోనూ ప్రేమను అర్థం చేసుకునే వాతావరణం కల్పించాలి. సమస్యలను వారు నమ్మకంగా చెప్పేలా ప్రోత్సహించాలి. ఇది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత. అయితే ఈ ఘటనకు గల యథార్థ కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఇన్ఫెక్షన్ ప్రమాదాలు తగ్గుతాయి..!!
( HYD Crime | TG Crime | crime | Latest News | telugu-news)