/rtv/media/media_files/2025/07/24/hyderabad-crime-news-2025-07-24-15-36-03.jpg)
Hyderabad Crime News
Hyderabad Crime News: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న యువతి ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చూస్తున్నారని బాధతో ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. చింతల యామిని (27) ఖమ్మం జిల్లాకు చెందిన ఈ యువతి.. గౌలిదొడ్డి ప్రాంతంలోని జేకే గ్రాండ్ హాస్టల్‌లో నివాసముంటూ గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేది. కొన్ని రోజులుగా ఆమె మనోవేదనలో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు.
ఇష్టం లేని పెళ్లి ఒత్తిడితో ఆత్మహత్య..
ఘటన జరిగిన రోజు యామిని తన స్నేహితులకు ఖమ్మం వెళ్లుతున్నానని చెప్పింది. ఆ తరువాత ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం హాస్టల్‌కి తిరిగి వచ్చినప్పుడు ఆమె గదిలో నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ ద్వారా లోపల చూశారు. అప్పటికే ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే ఈ విషాద వార్తను యామినికి దగ్గర కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: పచ్చి పాలతో చర్మం మెరుస్తుంది.. నల్లటి మచ్చలు మాయమవుతాయి
మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు.. యామినిపై ఇష్టం లేని పెళ్లి సంబంధాల ఒత్తిడి ఉండటం వల్లనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. కుటుంబ సభ్యుల తీరుతో ఆమె తీవ్రంగా మానసికంగా నలిగిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగం చేస్తున్న కూతురు చనిపోవటంతో కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తిన్న వెంటనే యాలకులు తింటే అనేక లాభాలు.. పచ్చి యాలకుల ప్రయోజనాలు తెలుసుకోండి
( TG Crime | crime | Latest News)