/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
BREAKING NEWS LIVE
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటికే ఏపీ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జాగ్రత్తలు పాటించాలని గురువారం కోవిడ్ రూల్స్ విడుదల చేసింది. ఇటీవల ముంబైలో ఇద్దరు కోవిడ్ బారిన పడి మృతి చెందారు. మహారాష్ట్ర, తమిళనాడులో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
Telangana First Covid Case
🚨🚨 BREAKING
— Bharat Media (@bharatmediahub) May 23, 2025
First COVID-19 case reported in #Telangana!
A doctor in Kukatpally, Hyderabad, has reportedly tested positive for COVID-19.#COVID19 pic.twitter.com/2qqX0a2QbH
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 వేగంగా వ్యాపిస్తోంది. వారం రోజుల్లోనే దాదాపు 300 యాక్టీవ్ కేసులు నిర్థారణ అయ్యాయి. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆసియాలో మళ్లీ కరోనా కోరలు విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యశాఖ అధికారులు కోవిడ్ వ్యాప్తిని, కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
covid | covid-19 | Covid-19 Cases | covid 19 positive | covid-19-updates | covid-cases | covid case in hyderabad | latest-telugu-news