/rtv/media/media_files/2025/12/02/covid-19-vaccine-2025-12-02-19-10-50.jpg)
COVID-19 Vaccine
ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో కోవిడ్-19 వ్యాక్సిన్ల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. చిన్నపిల్లలకు వేసిన కోవిడ్ టీకాల వల్ల తలెత్తిన తీవ్రమైన దుష్ప్రభావాల (Serious Side Effects)కు సంబంధించి ఒక అంతర్గత నివేదిక (Internal Report) లీక్ అయినట్లు కలకలం రేపింది. కోవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత కనీసం 10 మంది చిన్నారులు మరణించినట్లు ఓ నివేదికలో వచ్చిది. ఈ మరణాలకు కారణం టీకా వేసుకున్న తర్వాత గుండె కండరాలకు వాపు వచ్చే అరుదైన సమస్య అని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై పిల్లల మరణాలకు లీక్ అయిన విషయాలు ఈ ఆర్టికల్‌లో కొన్ని తెలుసుకుందాం.
సంచలన విషయాలు:
నివేదికల ప్రకారం.. 2021 నుంచి 2024 వరకు వ్యాక్సిన్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్‌కు అందిన 96 మంది పిల్లల మరణాల కేసులను విశ్లేషించిన తర్వాత.. అందులో కనీసం 10 మంది పిల్లలు కోవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత, దాని కారణంగానే మరణించి ఉండవచ్చని డాక్టర్లు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక లోతైన ప్రకటన అని తెలుపుతున్నారు. కోవిడ్-19 టీకాలు పిల్లలను చంపాయని యు.ఎస్. FDA మొట్టమొదటిసారిగా అంగీకరిస్తుందని రాసినట్లు నివేదికలో ఉంది. అయితే ఈ నివేదికలు ఆ బాధిత పిల్లల వయస్సు ఎంత.. వారు ఏ కంపెనీ టీకా తీసుకున్నారు.. లేదా ఆ మరణాలకు టీకాకు మధ్య ఉన్న సంబంధాన్ని FDA ఏ పద్ధతిలో నిర్ధారించింది అనే వివరాలు మెమోలో లేవని స్పష్టం చేస్తున్నాయి. ఈ డాక్యుమెంట్ అధికారికంగా విడుదల కాలేదు.. కేవలం అంతర్గత మెమో లీక్ అయిన్లు తెలుస్తోంది.
టీకా భద్రతపై ప్రశ్నలు-నిపుణుల విమర్శలు:
ఇంతకుముందు యుఎస్ ఆరోగ్య సంస్థలు కోవిడ్-19 టీకా పిల్లలకు సురక్షితమని ప్రకటించాయి. అయితే.. ఈ అంతర్గత నివేదిక లీక్ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ఈ మెమో విడుదలైన తీరుపై ఇతర ఆరోగ్య నిపుణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చిల్డ్రన్స్ వ్యాక్సిన్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ మెమోను సైన్స్ బై ప్రెస్ రిలీజ్‌గా చెబుతున్నారు. కీలకమైన వివరాలు లేకుండా ఇలాంటి క్లెయిమ్‌లు చేయడం బాధ్యతారాహిత్యం, ప్రమాదకరమని అంటున్నారు. ఒకవేళ అసాధారణమైన క్లెయిమ్‌లు చేస్తుంటే... దానికి తగిన అసాధారణమైన ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. FDAలో గతంలో వ్యాక్సిన్ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ మార్క్స్ ఈ మెమో యాంటీ-వ్యాక్సిన్ ప్లేబుక్ నుంచి వచ్చినట్లుగా ఉందని.. దీని రాజకీయ స్వరం (Political Tone) ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. VAERS డేటా అనేది కేవలం భద్రతా సంకేతాలను గుర్తించడానికి మాత్రమేనని.. మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి కాదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఈ రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు టాప్.. హెల్త్ మినిస్టర్ కీలక ప్రకటన!
కోవిడ్-19 వైరస్ సోకడం వల్ల వచ్చే మయోకార్డిటిస్ చాలా సందర్భాలలో టీకా వల్ల వచ్చే మయోకార్డిటిస్ కంటే మరింత తీవ్రంగా ఉంటుందని, టీకా-సంబంధిత మయోకార్డిటిస్ కేసులలో పిల్లలు త్వరగా కోలుకున్నారని అంతకుముందు జరిగిన అధ్యయనాలు స్పష్టం చేశాయి. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో మరణించిన పిల్లల సంఖ్య.. మెమోలో ప్రస్తావించిన 10 మరణాల కంటే చాలా ఎక్కువ అని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో యుఎస్‌లో వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియలో అనేక ముఖ్యమైన మార్పులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు నివేదికలో వచ్చింది. భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయసుల సమూహాల వ్యక్తులను చేర్చడం తప్పనిసరి చేయాలని.. తద్వారా ఏదైనా దుష్ప్రభావాన్ని సకాలంలో గుర్తించవచ్చని వైద్యులు అంటున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన:
వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ అంచనా ప్రక్రియ, ఒకేసారి అనేక టీకాలు ఇవ్వడం వంటి విధానాలను కూడా పునఃసమీక్షించాలని వైద్యులు అంటున్నారు.
ఈ వార్త అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల ఆందోళనను పెంచింది. పిల్లలకు టీకా ఎంత సురక్షితమనే ప్రశ్న మరోసారి చర్చనీయాంశమైంది. అపోహలు, భయాన్ని నివారించడానికి.. ఇలాంటి నివేదికలపై నిశితమైన శాస్త్రీయ విచారణ, పారదర్శకత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీకాల ద్వారా వచ్చే ప్రయోజనాలు (Benefits), అరుదైన ప్రమాదాలు (Rare Risks) మధ్య ఉన్న సమతుల్యతపై పూర్తి సమాచారం ప్రజలకు చేరాలని వారు కోరుతున్నారు. ఈ అంతర్గత నివేదికపై మరింత అధికారిక స్పష్టత వచ్చే వరకు వేచి ఉండాలని, టీకాల గురించి ఏదైనా ఆందోళన ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఆ నెయ్యి తింటే చావు తప్పదు.. ఈ 6 షాకింగ్ విషయాలు మీ కోసమే!
Follow Us