/rtv/media/media_files/2025/05/23/LQvaDKQQgbp3K4lMctLY.jpg)
Nikita Dutta tested covid 19 postive
BIG BREAKING: కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 257కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరో బాలీవుడ్ నటి కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఇటీవలే 'జ్యువెల్ థీఫ్' సైఫ్ అలీఖాన్ తో కనిపించిన బెంగాలీ నటి నికితా దత్తా.. తనకు కరోనా సోకినట్లు తెలిపారు. తనతో పాటు ఆమె తల్లికి కూడా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని నికిత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. కోవిడ్ నా అమ్మకు, నాకు హలో చెప్పడానికి వచ్చింది. ఈ ఆహ్వానం లేని అతిథి ఎక్కువ రోజులు ఉండదని ఆశిస్తున్నాను. చిన్న క్వారంటైన్ తర్వాత కలుద్దాం. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు.
ఇటీవలే నటి శిల్పా శిరోద్కర్
ప్రస్తుతం నికిత తన ఇంట్లో క్వారెంటైన్ లో ఉన్నారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన స్వల్ప లక్షణాలను ఎదుర్కుంటున్నారు. ఈ మేరకు తన ప్రస్తుతం ప్రాజెక్టులన్నింటినీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే నటి శిల్పా శిరోద్కర్ కూడా కోవిడ్-19 బారిన పడ్డారు.
/rtv/media/media_files/2025/05/23/MtQo0DG4GXO07LXCptlg.png)
గత కొద్దిరోజులుగా ఆసియా అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ విషయానికి వస్తే.. మే నెలలో ముంబైలో ఇప్పటివరకు 95 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవగా, జనవరి నుంచి మహారాష్ట్ర అంతటా 106 కేసులు నమోదైనట్లు సమాచారం. తాజాగా ఏపీలో కూడా ఓ కేసు నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా హాంకాంగ్, సింగపూర్‌లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హాంకాంగ్ హెల్త్ సెంటర్ ప్రకారం, వైరస్ ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అందరూ మాస్క్ వేసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
latest-news | covid-19 | Covid-19 Cases | covid-19-updates | Nikita Dutta covid 19
Also Read: #AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు