/rtv/media/media_files/2025/10/14/covid-19-children-2025-10-14-07-08-37.jpg)
covid-19 children
పిల్లలు, యుక్త వయస్కులలో కోవిడ్-19తో రీ-ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం దీర్ఘకాలిక కోవిడ్ (Long COVID) ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని ఓ పరిశోధన వెల్లడించింది. కోవిడ్-19 సోకిన తర్వాత కూడా పిల్లలు ఎక్కువ కాలం అనారోగ్యంతో ఉండటం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడటాన్ని లాంగ్ కోవిడ్ అంటారు. అమెరికాలోని 40 బాలల ఆసుపత్రుల నుంచి 4 లక్షల 60 వేల మందికి పైగా పిల్లల ఆరోగ్య రికార్డులను ఈ అధ్యయనం పరిశీలించింది. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పిల్లల్లో ప్రమాదం రెట్టింపు:
అధ్యయనం ప్రకారం.. ప్రతి లక్ష మంది పిల్లల్లో దాదాపు 904 మంది ఆరు నెలల్లోపు దీర్ఘకాలిక కోవిడ్ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. రెండోసారి కోవిడ్ సోకిన తర్వాత.. ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని చెబుతున్నారు. రీ-ఇన్ఫెక్షన్ తరువాత పిల్లల్లో మయోకార్డైటిస్ (గుండె వాపు), రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. ఈ సమస్యలు అరుదుగా ఉన్నప్పటికీ.. ఒకవేళ వస్తే పిల్లలకు గణనీయమైన ఇబ్బందులను కలిగిస్తాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:అపోహలు వీడండి నిజం తెలుసుకోండి
కోవిడ్-19 కేవలం సాధారణ జలుబు కాదు. ఇది పిల్లలలో అనేక అవయవాలపై ప్రభావం చూపి.. వారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక పర్యవసానాలు కలిగిస్తుందని తెలిపారు. అందువల్ల పిల్లలకు టీకా (Vaccination) ఇవ్వడం చాలా ముఖ్యమని.. ఇది కోవిడ్, దీర్ఘకాలిక కోవిడ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనవరి 2022 , అక్టోబర్ 2023 మధ్య ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి సమయంలో ఈ అధ్యయనం జరిగినట్లు తెలుపుస్తున్నారు. అయితే పిల్లల్లో, యుక్తవయస్కుల్లో కోవిడ్ టీకా కవరేజీని పెంచడం అత్యంత ముఖ్యమైన చర్య అని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారా..? దాని ప్రభావం మీ మూత్ర పిండాలపై పడుతుంది జాగ్రత్త!!