Telangana: సీఐ వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ అక్రమాలు, విద్యార్థినీలకు వేధింపులపై విసిగిపోయిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వందలాది మంది రోడ్లపైకి వచ్చి రహదారిపై మెరుపు ధర్నాకు దిగారు.
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది.
కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు. మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
చోరీ కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేయడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు మరికొంతమందిపై దాడి చేసి పారిపోయాడు.
మూడు నెలలుగా ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న యువతి అనుమానస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించడంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న యువతి ఈ రోజు అనుమానస్పదంగా మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మందకు కావలిగా ఉన్న నవీన్ అనే వ్యక్తితో పాటు అతని బావమరిదిపై దాడిచేశారు. సుమారు70 గొర్రెలను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు.