Shadnagar: షాద్‌ నగర్‌లో ఉద్రిక్తత..విద్యార్థినీలపై చేయి చేసుకున్న కానిస్టేబుల్..తిరగబడ్డ స్టూడెంట్స్..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్‌ అక్రమాలు, విద్యార్థినీలకు వేధింపులపై విసిగిపోయిన  ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వందలాది మంది రోడ్లపైకి వచ్చి రహదారిపై మెరుపు ధర్నాకు దిగారు.

New Update
FotoJet - 2025-11-02T133328.526

Tension in Shad Nagar.. Students attacked a female constable..?

 Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్‌ అక్రమాలు, విద్యార్థినీలకు వేధింపులపై విసిగిపోయిన నాగర్‌కర్నూల్  ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వందలాది మంది రోడ్లపైకి వచ్చి రహదారిపై మెరుపు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ శైలజ అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మెస్ సరుకుల తరలింపు, విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ నడిరోడ్డుపై విద్యార్థినిల ధర్నాకు దిగారు.

తమ సమస్యలపై గళమెత్తిన విద్యార్థినీలు పట్టణంలోని చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. విద్యార్థినులను ఆందోళన నుంచి ఆపడానికి అధ్యాపక బృందం విపరీతంగా ప్రయత్నం చేసింది. కానీ విద్యార్థినులు వారిని లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలి అంటూ నినదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఆందోళన విరమింపజేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ఓ మహిళా కానిస్టేబుల్‌ అత్యుత్సహం ప్రదర్శించారు. వారితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో సహనం కోల్పోయిన కానిస్టేబుల్‌  ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో మిగతా విద్యార్థినులు ఆగ్రహానికి గురై మహిళా కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. ఈ క్రమంలో -- నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని  కానిస్టేబుల్, స్టూడెంట్స్ కొట్టుకున్నారు.

కొంతమంది విద్యార్థినీలు ఆమెపై దాడి చేశారు. తమకు అన్యాయం జరిగితే న్యాయం చేయాలని ఆందోళన చేస్తుంటే  తమనే కొడతారా? అని విద్యార్థినులు ఈ సందర్భంగా పోలీసులను నిలదీశారు. కానిస్టేబుల్‌ పై దాడితో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. -- అదుపు చేసే క్రమంలో కానిస్టేబుల్‌తో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.ఈ ఘటనతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. జిల్లా కలెక్టర్‌ వచ్చి తమ సమస్యను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థినులు స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థినులను పోలీసుల బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థినులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినులను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన విద్యార్థినులు పీఎస్‌కు తరలించారు. విద్యార్థుల సమస్యలపై  జోనల్ ఆఫీసర్ నిర్మల స్పందించారు. 10రోజుల్లో కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Bigg Boss 9: ఏరా భట్టు ప్రేమ కావాలా.. దివ్వెల మాధురి- భరణి స్కిట్ అదిరింది! నవ్వులే నవ్వులు

Advertisment
తాజా కథనాలు