ఫలించిన కానిస్టేబుల్ భార్యల కృషి.. సెలవుల రద్దు నిర్ణయం నిలిపివేత
తెలంగాణలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
JOBS: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
మీకు పోలీస్ అవ్వాలని ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 39,481 పోస్టులు భర్తీ కానున్నాయి. అప్లై చేయడానికి వివరాలు కింద చదివేయండి.
Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఆఫీసర్ బదిలీ అయి వెళ్ళిపోతున్నారు. ఆయనకు టీమ్ మొత్తం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో డాన్స్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్టుండి పడిపోయారు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.
Uttar Pradesh : మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్‌గా డిమోట్
ఉత్తరప్రదేశ్‌లోని ఓ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారికి అక్కడి పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నేరానికి పాల్పడిన ఆ డీఎస్పీని.. కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేసింది.
కానిస్టేబుల్ చొరవ..భుజాల మీద మోసి మరీ ప్రాణాలు కాపాడిన వైనం
చనిపోతున్న వ్యక్తిని మోసుకుని తీసుకెళ్ళి మరీ ప్రాణాలు కాపాడారు కరీంనగర్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడని సమాచారం అందుకున్న కానిస్టేబుల్..2 కిలోమీటర్లు పొలాల నుంచి నడిచి ఊరికి చేరుకుని అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
సీఐ మర్మాంగాలు కోసి చంపిన కేసు.. కానిస్టేబుల్ దంపతుల అరెస్ట్
మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనకు కారణమైన కానిస్టేబుల్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరినీ బుధవారం సాయంత్రం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.