/rtv/media/media_files/2025/10/18/constable-attacked-with-knife-2025-10-18-07-43-11.jpg)
Constable attacked with knife
Crime News: చోరీ కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై నిందితుడు కత్తితో దాడి చేయడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..టూవీలర్ దొంగిలించిన కేసులో నిందితున్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తుండగా అతడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ మృతిచెందాడు. ద్విచక్రవాహనం దొంగిలించిన నిజామాబాద్‌లోని హాస్మీ కాలనీకి చెందిన రియాజ్ (24)ను పట్టుకునేందుకు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (42), తన మేనల్లుడిని సాయంగా తీసుకుని శుక్రవారం రాత్రి ఆ కాలనీకి వెళ్లారు.
మొత్తం మీద నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని.. బైక్‌పై ఎక్కించుకున్నారు. కానిస్టేబుల్ బైక్ నడుపుతుండగా.. అతని మేనల్లుడు వెనుక కూర్చుని నిందితున్ని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. వారు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా.. వినాయక్‌నగర్ సమీపంలోకి రాగానే నిందితుడు కత్తితో కానిస్టేబుల్ ఛాతీలో పొడిచాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన ప్రమోద్ మేనల్లుడిపైనా దాడి చేశాడు. ఈలోగా మరో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి రియాజ్‌ను తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడే అక్కడికి వచ్చిన సీసీఎస్ ఎస్‌ఐ విఠల్ వారిని అడ్డుకున్నాడు. కానీ, రియాజ్ ఆయనపైనా కత్తితో దాడి చేసి అక్కడినుంచి పరారయ్యారు. స్వల్ప గాయాలైన ఎస్‌ఐ.. విషయాన్ని సీఐ శ్రీనివాస్‌రాజ్‌కు తెలిపారు. సీఐ, నాలుగో ఠాణా ఎస్‌ఐ శ్రీకాంత్‌లు వచ్చి ప్రమోద్‌ను వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. కానీ అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమోద్ మేనల్లుడికి గాయాలైనప్పటికీ ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రమోద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్