/rtv/media/media_files/2025/04/28/fyd0PDgQzgxIbfarvA1e.jpg)
Unidentified Persons Attacked Constable
Hyderabad : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మందకు కావలిగా ఉన్న నవీన్ అనే వ్యక్తితో పాటు అతని బావమరిదిపై దాడిచేశారు. ఇద్దరిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేసి సుమారు70 గొర్రెలను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
గొర్లకి కావలికి వెళ్లిన కానిస్టేబుల్ పై కత్తులతో దాడి చేసి 70 గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025
హైదరాబాద్ - హయత్ నగర్ కొహెడలో గొర్లకి కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 70 గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్కు… pic.twitter.com/qk5hgVgLHf
Also Read: Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌అండ్‌టీ
తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మందకు కావలిగా కానిస్టేబుల్ నవీన్ అతని బావమరిది రాత్రి సమయంలో అక్కడ పడుకున్నారు. అర్ధరాత్రి బొలెరో వాహనం లో వచ్చిన సుమారు పదిమందిలో ముగ్గురు అక్కడ కావలిగా పడుకున్న కానిస్టేబుల్ నవీన్, అతని బామ్మర్ది పై లేవకుండా కూర్చుని ఉండగా మరి కొంతమంది గొర్రెలను బొలెరో వాహనంలో ఎక్కించుకొని పరారయ్యారు. వారిని అడ్డుకున్న కానిస్టేబుల్ నవీన్ పై కత్తితో దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!
కాగా, ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి పశువులు, మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్తున్నారు. వారం రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక రైతు తన పొలంలో మేపుతున్న గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఒక పౌల్ట్రీ ఫామ్‌లో చొరబడిన దొంగలు పెద్ద సంఖ్యలో కోళ్లను దొంగిలించారు. గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల కాపరులపై దాడి చేసి గొర్రెలను ఎత్తుకెళ్లారు వీరిలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కోహెడలో జరిగిన ఈ గొర్రెల దొంగతనం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా గొర్రెలకు కాపలగా పడుకుంటున్న గొర్రెల కాపరులు ఈ ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు.