Telangana: సీఐ వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్‌ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

New Update
Woman Constable Suicide Attempt over CI harassment in kothagudem

Woman Constable Suicide Attempt over CI harassment in kothagudem

కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్‌ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. దీంతో కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు దీనిపై సీఐ స్పందించారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా అంటూ కొట్టిపారేశారు. 

తనపై ఎవరైనా తిరిగబడితే వాళ్ల పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటానని మహిళా సీఐ బెదిరించారు. దీంతో స్టేషన్లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి, తమను సీఐ వేధిస్తోందని ఎక్సైజ్‌ సూపరింటెండ్‌కు మరో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు వినతిపత్రం అందించారు. దీనిపై విచారణ జరిపి, ఉన్నతాధికారులకు రిపోర్టు అందిస్తామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు