/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
Death
హైదరాబాద్‌లోని ఉప్పల్ విషాదం చోటుచేసుకుంది. మల్లికార్జున నగర్‌లో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్.. ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 23 నుంచి అతడు విధులకు హాజరుకావడం లేదని ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్థిక సమస్యల వల్లే అతడు సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: శంషాబాద్‌లో పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన
ఇదిలాఉండగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఇటీవల ఓ యువ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ ఆన్‌లైమ్ గేమ్స్‌కు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. అప్పులు కట్టాలంటూ వాళ్లు ఒత్తిడి చేయగా.. మనస్తాపానికి గురైన సందీప్.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి తండ్రి 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. సందీప్‌కు తల్లి, చెల్లి ఉన్నారు.
Also Read: ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు వదిలి వెళ్లిన అగంతకులు.. పండుగ చేసుకున్న ప్రజలు
Follow Us