/rtv/media/media_files/2025/11/03/onstable-dies-by-suicide-after-losing-money-in-online-games-in-sangareddy-2025-11-03-18-45-02.jpg)
onstable dies by suicide after losing money in online games in Sangareddy
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల అప్పులపాలై ఆయన సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్‌కు చెందిన సందీప్.. సంగారెడ్డిలో రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
Also Read: చేవెళ్ల బస్సు ప్రమాదం.. అనాథలైపోయిన ఇద్దరు చిన్నారులు
Constable Dies By Suicide
సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. సందీప్ ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ డబ్బులు రికవరీ చేసేందుకు తన స్నేహితులు, సహచరుల నుంచి అప్పులు తీసుకున్నాడని చెప్పారు.వాళ్లు అప్పులు ఇవ్వమని అడగటంతో సందీప్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Also read: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో రాజకీయం.. కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ Vs బీజేపీ-వీడియోలు!
 Follow Us