/rtv/media/media_files/2025/10/31/up-2025-10-31-13-48-42.jpg)
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. కాన్పూర్‌లోని మంధానా ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ బ్రిజేష్ సింగ్ స్థానికంగా నివసిస్తున్న ఒక మహిళ కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలికను ఏకాంతంగా చూసి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాలిక ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది.
కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తల్లి ధైర్యంగా సంఘటన స్థలానికి వెళ్లి అక్కడే ఉన్న ఆ కానిస్టేబుల్‌ను అడ్డగించి, కాలర్ పట్టుకుని వీధుల్లోకి లాక్కొచ్చింది. అతడిని కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ అందరూ చూస్తుండగానే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. నిందితుడిని తల్లి నేరుగా పోలీసుల ముందు హాజరుపరచడంతో, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. అతనిపై పోక్సో (POCSO) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
शर्मनाक
— The News Basket (@thenewsbasket) October 29, 2025
कानपुर के गोल चौराहे पर एक लड़की स्टांप पेपर लेने गई थी तभी वहां मौजूद पुलिसकर्मी ने लड़की को छेड़ना शुरू कर दिया और उसके साथ अश्लील हरकत किया
लड़की और लड़की की बहन ने बहादुरी दिखाई, पुलिस वाले का हाथ पकड़ कर खींचते हुए पुलिस चौकी ले गई ...रास्ते में पुलिस वाले ने अपना… pic.twitter.com/X2wunUiZGf
అంతేకాకుండా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి చేసిన ఈ దారుణ చర్య కాన్పూర్‌లో చర్చనీయాంశంగా మారింది. తల్లి చూపిన ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, కానిస్టేబుల్ బాధితురాలి తల్లికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది.
Follow Us