kakinda : కానిస్టేబుల్ అత్యుత్సాహం.. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మైనర్!

కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు.  మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

New Update
ap

కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు.  మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. క్రాకర్స్ విషయంలో బాలుడు అక్షయ్‌తో సతీష్ అనే ఓ కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగాడు. దీంతో చిన్న విషయానికే కోపం పెంచుకున్న కానిస్టేబుల్ సతీష్.. మైనర్ బాలుడిని అత్యంత దారుణంగా చితకబాదాడు.

బాలుడి పరిస్థితి విషమం

దీంతో కానిస్టేబుల్ సతీష్ అత్యుత్సాహంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వెంటనే కాకినాడ ఆస్పత్రికి తరలించారు. దీంతో కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దళిత సంఘాల ఆందోళనకు దిగాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించాయి. విషయం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు అక్కడికి చేరుకుని పరిస్థితి గురించి వివరాలు సేకరించారు. కానిస్టేబుల్‌ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు