నాన్నలేడు..అమ్మ కష్టపడుతోంది.. ! | Child Shocking Facts Revealed On Harish Rao Talking | RTV
పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. పిల్లల పోర్న్ చూసిన, షేర్ చేసిన కేసులు తప్పవంటున్నారు.
భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. అనారోగ్యానికి గురైన ఓ శిశువును తల్లిదండ్రులు భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడు ఆ చిన్నారిని మంటపై తలకిందులుగా వేలాడదీయంతో రెండు కళ్లు దెబ్బతిన్నాయి.
స్పెర్మ్ డొనర్ కైల్ గోర్డీ 2025 చివరి నాటికి 100 మంది పిల్లలకు తండ్రి అవ్వనున్నాడు. లాస్ ఏంజిల్స్కు చెందిన కైల్ గోర్డీ మహిళలకు ఉచితంగా స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోర్డీ 87 మంది పిల్లలు కనడానికి వీర్యకణాలను దానం చేశాడు.
అల్వాల్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హాట్ వాటర్ బ్యాగ్ పగిలి.. ఆ వేడి నీరు పడడంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. చిన్నారి పై నీళ్లు పడిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
కన్న బిడ్డను అమ్మేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్ జంట బీర్, వెయ్యి డాలర్ల డబ్బు కోసం మూడు నెలల బిడ్డను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. బిడ్డను విక్రయిస్తున్నట్లు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు.
చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, లేక డౌన్ లోడ్ చేసుకున్నా, లేక షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది
పాకిస్థాన్లో దారుణం జరిగింది. బిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తండ్రి ఆ చిన్నారిని సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్సకు డబ్బులు లేకే ఈ పని చేశానంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.