/rtv/media/media_files/2025/08/23/dried-fruits-2025-08-23-10-36-55.jpg)
Dried Fruits
Child Memory: డ్రైఫ్రూట్స్(Dry Fruits), నట్స్(Nuts) ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలుసు. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, కె వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు మెదడు కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి, వాటి మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి. తద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి సహాయపడతాయి. అయితే కేవలం డ్రైఫ్రూట్స్ తినడం వల్ల మాత్రమే అద్భుతాలు జరిగిపోవు. మంచి పోషకాహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అయితే పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే సరైన పోషకాహారం చాలా అవసరం. కేవలం పాలు లేదా సాధారణ ఆహారమే కాకుండా పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శక్తిని పెంచడానికి డ్రైఫ్రూట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఆరు రకాల డ్రైఫ్రూట్స్‌ను పిల్లల ఆహారంలో చేర్చడం ద్వారా వారి మెదడును చురుగ్గా మార్చవచ్చు. ఆ ఆహారాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బాదం:
జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతకు బాదం అత్యుత్తమమైనది. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. రోజుకు 4-5 నానబెట్టిన బాదంపప్పులు ఇవ్వడం వల్ల వారి మెదడు, కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాల్‌నట్: దీనిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, DHA పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆలోచనా సామర్థ్యాన్ని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతాయి.వాల్‌నట్ రోజూ పిల్లలకి పెడితే ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది.
జీడిపప్పు: ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం ఉండటం వల్ల పిల్లల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
పిస్తా: ఇది జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులో విటమిన్ బి6, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది.
ఎండిన ద్రాక్ష: ఇందులో గ్లూకోజ్, ఐరన్ ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
తామర గింజలు: ఇది మెదడుతోపాటు ఎముకలను కూడా బలపరుస్తుంది. ఇందులో ప్రొటీన్, కాల్షియం ఉంటాయి. ఈ డ్రైఫ్రూట్స్‌ను పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేయడం ద్వారా వారిని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచవచ్చు.డ్రైఫ్రూట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మెదడుకు అవసరమైన పోషకాలు అంది, జ్ఞాపకశక్తి పెరగడానికి, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఓవర్ టైం వర్క్‌తో ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో తెలియటం లేదా..? ఈ చిట్కాలతో పని ఒత్తిడి పరార్!!